కాంగ్రెస్‌ను బ‌ల‌వంత పెట్టం.. సుప్రీంకు చెప్పిన ఐటీశాఖ‌

కాంగ్రెస్‌ను బ‌ల‌వంత పెట్టం.. సుప్రీంకు చెప్పిన ఐటీశాఖ‌

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. సుమారు రూ.1700 కోట్లు చెల్లించాల్సి ఉందని ఇటీవల ఆదాయపన్ను శాఖ ఆ పార్టీకి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. పన్ను బాకీలతో కలిపి మొత్తం అమౌంట్ రూ.3567 కోట్లుగా ఉంది. ఆ కేసులో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సుప్రీంను ఆశ్రయించింది. ఆదాయపన్ను శాఖ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై ఆ అమౌంట్ చెల్లించాలని బలవంత పెట్టమని ఆయన తెలిపారు. జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని బెంచ్ కు ఆయన ఈ విషయాన్ని చెప్పారు. ఈ కేసులో వాదనలను జూన్ నెలకు వాయిదా వేయాలని ఆదాయపన్ను శాఖ సుప్రీంను కోరింది. ఎన్నికల సమయంలో ఏ పార్టీకి కూడా సమస్యలు క్రియేట్ చేయడం తమ ఉద్దేశం కాదు అని ఐటీశాఖ తెలిపింది. జూలై 24వ తేదీకి ఈ కేసును వాయిదా వేశారు. బీజేపీ సర్కారు పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos