నవీన్ జిందాల్ రాజీనామా పెద్ద జోక్

నవీన్ జిందాల్ రాజీనామా పెద్ద జోక్

న్యూ ఢిల్లీ: మాజీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ కాంగ్రెస్ను వీడి కాషాయ పార్టీలో చేరడంపై కాంగ్రెస్ నేత జై రాం రమేష్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ రహిత భారత్ను కోరుకుంటున్నారని, కానీ ఆయన అవినీతి రహిత కాంగ్రెస్ను తయారుచేస్తున్నారని వ్యాఖ్యానించారు. మీకు భారీ వాషింగ్ మెషీన్ అవసర మైనప్పుడు ఇలా జరుగుతుంది..గత పదేండ్లుగా పార్టీకి ఎలాంటి సేవలందించని మీరు ఇప్పుడు రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం పెద్ద జోక్ అని నవీన్ జిందాల్ను ఉద్దేశించి జైరాం రమేష్ ట్వీట్ చేశారు. మనీ ల్యాండరింగ్ కేసులో సంబంధం ఉందనే ఆరోపణలపై జిందాల్కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసిన వార్తా పత్రికల క్లిప్పింగ్స్ స్క్రీన్ షాట్స్ను జైరాం రమేష్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రధాని కాంగ్రెస్ రహిత భారత్ను కోరుకుంటున్నారు..కానీ ఆయన అవినీతి రహిత కాంగ్రెస్ను తయారుచేస్తున్నారని మరో పోస్ట్లో పేర్కొన్నారు. ఈడీ, సీబీఐతో పాటు పలు వాషింగ్మెషీన్స్తో కాంగ్రెస్ నేతలను ప్రక్షాళన చేసి కాషాయ పార్టలో చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నవీన్ జిందాల్ ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కాషాయ గూటికి చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో దేశాభివృద్ధికి పాటుపడేందుకు గర్వంగా ఉందని నవీన్ జిందాల్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ కలను సాకారం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. కాగా, నవీన్ జిందాల్ హరియాణలోని కురుక్షేత్ర నుంచి బీజేపీ టికెట్పై లోక్సభ ఎన్నికల బరిలో దిగనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos