రేపు బాబ్రీ కూల్చివేత కేసులో తీర్పు, అంతటా హైఅలెర్ట్‌

రేపు బాబ్రీ కూల్చివేత కేసులో తీర్పు, అంతటా హైఅలెర్ట్‌

న్యూ ఢిల్లీ : బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పును బుధవారం లక్నో ప్రత్యేక న్యాయ స్థానం వెలువరించనుంది.ఈ కేసులో నిందితులైన అద్వానీ, మురళి మనోమర జోషి , తదితరులందరినీ తప్పకుండా హాజరు కావాలని న్యాయస్థానం ఇది వరకే ఆదేశించింది. దేశ వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలు, మత ఘర్షణలకు అవకాశం ఉండే ప్రాంతాల్లో భద్రతను పెంచాలని కేంద్రం ఆదేశించింది. కేసు తీర్పు ప్రభావం శాంతి భద్రతలపై పడే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం కేసులో సుప్రీం కోర్టు తీర్పు కొన్ని సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసులోనూ తీర్పు ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా రావొచ్చునని, దీంతో సామాజిక మాద్యమాల్లో విద్వేష ప్రసంగాలు వచ్చే అవకాశం ఉంది. వాటిపై కూడా నిఘా ఉంచాలని కేంద్రం హెచ్చరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos