అల్‌ఖైదా కొత్త నేత సైఫ్‌ అల్‌-అడెల్‌

అల్‌ఖైదా  కొత్త నేత సైఫ్‌ అల్‌-అడెల్‌

న్యూయార్క్: నిషేధిత ఉగ్రసంస్థ అల్ఖైదా చీఫ్ అయ్మన్ అల్ – జవహిరి(71) ని అమెరికా మట్టుబెట్టి కొన్నిగంటలు గడవక ముందే ఆయన వారసుడుగా సైఫ్ అల్-అడెల్డి తెర మీదకు వచ్చాడు. అల్-అడెల్. అల్ ఖైదా వ్యవస్థాప సభ్యుడిగా, సీనియర్ మెంబర్గా, సంస్థలో మూడో స్థాయిలో ఇంతకాలం ఉన్నాడని మిడిల్ ఈస్ట్ ఇనిస్టిట్యూట్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఎఫ్బీఐ దాఖలాల ప్రకారం జవహిరిలాగే అడెల్ కూడా ఈజిప్ట్ పౌరుడు. అక్కడి ఆర్మీలో కల్నల్ ర్యాంకుతో పని చేశాడు. జవహిరి స్థాపించిన ఇజిప్టియన్ ఇస్లామిక్ జిహాద్లో సైఫ్ అల్-అడెల్ పని చేశాడు. ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్గా పేరు ఉంది. 1980లలో ఆఫ్ఘనిస్తాన్లో రష్యా దళాలతో పోరాడాడు. అమెరికన్లనే మాట వింటే చాలు రగిలిపోతాడు. గతంలో అమెరికన్లను హతమార్చిన ఘటనలు, వారి ఆస్తుల విధ్వంసం, భద్రతా విభాగాల్ని విచ్ఛిన్నానికి ప్రయత్నించాడనే ఆరోపణలు అతనిపై ఉన్నాయి. 1998లో టాంజానియా, కెన్యాలోని రాయబార కార్యాలయాల్లో బాంబు పేలుళ్ల ద్వారా అమెరికన్లను హత మార్చే యత్నం చేసారనే ఆరోపణా ఉంది. అతణ్ని పట్టించిచ్చాని, సమచారం అందించిన వాళ్లకు 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. 1993 అక్టోబర్లో సోమాలియా మోగదిషూ దగ్గర జరిగిన బ్లాక్ హాక్ డౌన్ ఘటనకు మూల కారణం ఇతడే. ఆ ఘటనలో అమెరికాకు చెందిన పద్దెనిమిది మంది జవాన్లు బలయ్యారు. ఒసామా బిన్ లాడెన్ సెక్యూరిటీ చీఫ్గా పని చేయడంతో సైఫ్ అల్-అడెల్ బాగా ఆప్తుడిగా మెదిలేవాడు. జవహిరి కంటే అడెల్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు లాడెన్. 2001 నుంచే ఎఫ్బీఐ మోస్ట్-వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడు. బిన్ లాడెన్ మరణిం చినప్పటి నుండి, అల్-అడెల్ ఒక ముఖ్యమైన వ్యూహకర్తగా మారాడు. బ్లాక్ హాక్ డౌన్ తరువాత చాలాకాలం పాటు ఇరాన్లోనే ఉన్నాడు. ప్రస్తుతం అతనెక్కడ ఉన్నాడన్నది తెలియదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos