అట్టహాసంగా ఆదాల జన్మదినోత్సవం

అట్టహాసంగా ఆదాల జన్మదినోత్సవం

నెల్లూరు: లోక్‌సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి జన్మదినోత్సవం శుక్రవారం ఉదయం ఇక్కడ ఆయన నివాసంలో వైభవంగా జరిగింది. ఆయన్ను అభినందించేందుకు పలువురు నేతలు, కార్యకర్తలు ఉదయం నుంచే ఆయన ఇంటికి బారులు దీరారు. ఆయన వర్ధిల్లాలి అని నినాదాలు చేసారు. భారీ గజమాలలతో సత్కరించారు. డప్పుల మోత మోగించారు.  బాణాసంచా శబ్దాలతో ప్రాంతమంతా హోరెత్తింది. కార్యకర్తలు, నేతలు శాలువాలు, పూల మాలలతో సత్కరించి  అభిమానాన్ని చాటుకున్నారు. ఆ తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి భారీ కేకును కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు.  ప్రాంతా ల కతీతంగా పార్టీలకతీతంగా ఆయన అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు . ఆయన ఇంటికి ఇరువైపులా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.ఆదాల అభిమాని నిజాముద్దీన్ హైదరాబాదు నుంచి భారీ బెలూన్ను తెప్పించి గురువారం రాత్రి ఆయన ఇంటి పైన ఎగర వేశారు. తన అభి మా నాన్ని ఆకాశమంత ఎత్తులో చూపించుకున్నారు. భారీ సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులకు కు అల్పాహారం మిఠాయిలు పంపిణీ జరిగింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos