దర్శకుడు రవిబాబు వేధిస్తున్నాడు..

  • In Film
  • September 6, 2019
  • 105 Views
దర్శకుడు రవిబాబు వేధిస్తున్నాడు..

దర్శకుడు రవిబాబుపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసిన లైంగిక ఆరోపణలు తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి.దర్శకుడు రవిబాబు తనను లైంగికంగా వేధిస్తున్నాడని తనకు అవకాశాలు రాకుండా రవిబాబు అడ్డుకుంటున్నాడంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శిరీష ఆరోపణలు చేశారు.నువ్విలా చిత్రంలో పని చేసే సమయంలోనే రవిబాబు వ్యక్తిత్వం ఏంటో తెలిసిందన్నారు.చిత్రీకరణ సమయంలో అసభ్యంగా తిట్టేవాడని ఫోన్ చేసి మరింత అసభ్యంగా మాట్లాడేవాడని ఆరోపించారు. ‘నీ రేటు ఎంత..?’ అంటూ బూతులు మాట్లాడేవాడని.. రవిబాబు చేసినట్లు ఉన్న మెసేజ్ లను చూపించారు.రెండేళ్ల నుండి తనను వేధిస్తున్నాడని.. అవకాశాల కోసం దర్శకనిర్మాతలను సంప్రదిస్తుంటే.. వాళ్లకి ఫోన్లు చేసి అవకాశాలు ఇవ్వకూడదని చెబుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అతడి పక్కలోకి వెళ్లలేదని బతుకు లేకుండా చేస్తున్నాడని.. పెద్ద డైరెక్టర్ కదా అని తనను ఏం చేస్తాడో అని భయపడి ఎవరికి చెప్పలేదని..రవిబాబు కారణంగా తనకు ప్రాణహాని ఉందని వెల్లడించారు. దర్శకులు నిర్మాతల పక్కల్లోకి అయితే మేం వెళ్లాలి.. సినిమా అవకాశాలు మాత్రం ఇతర ఇండస్ట్రీ వాళ్లకు ఇస్తున్నారని ఆరోపించారు.గతంలో తను పని చేసిన దర్శకులు, నిర్మాతల వద్దకు వెళ్తుంటే ఎవరో తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారని.. బెదిరిస్తున్నారని ఆరోపించారు.తాను ఈ స్థితిలో ఉండటానికి రవిబాబు మాత్రమే కారణమని, తనకు రవిబాబు అన్యాయం చేయడమే గాక అవకాశాలు రాకుండా ఈ విషయంలో తనకు ఎవ్వరూ సహకారం అందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos