మానవత్వం చాటుకున్న ప్రకాశ్ రాజ్..

  • In Film
  • March 23, 2020
  • 120 Views

కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ చర్యలకు ఉపక్రమించడంతో దినసరి, రోజువారీ వేతన కూలీలు, ఉద్యోగులు, తక్కువ జీతం కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంలో పడింది. ఇలాంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నటుడు ప్రకాశ్ రాజ్ మానవత్వాన్ని చాటుకొన్నారు.తన ఉద్యోగులను, సిబ్బందిని అక్కున చేర్చుకొన్నారు. తాను తీసుకొన్నచర్యలను ట్విట్టర్‌లో వెల్లడించారు.జనతా కర్ఫ్యూ’తో… నా నగదు నిల్వను ఒకసారి చూసుకున్నాను. నా ఇంట్లో, నా ఫార్మ్ హౌస్ లో, నా ఫిల్మ్ ప్రొడక్షన్, ఫౌండేషన్ లో ఉద్యోగం చేసేవారికీ… నా వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకూ జీతాలు ముందుగానే చెల్లించేశాను. నేను నిర్మిస్తున్న మూడు చిత్రాలకు సంబందించి షూటింగ్ ఆగిపోయింది. ఆ ప్రొడక్షన్‌లో దినసరి వేతనం తీసుకొనే కార్మికుల గురించి ఆలోచించాను అని ప్రకాశ్ రాజ్ ట్వీట్‌లో తెలిపారు.కరోనా మహమ్మారితో పాటిస్తున్న సోషల్ డిస్టెన్సింగ్ మూలంగా షూటింగ్స్ నిలిచిపోయాయి. ఆ దినసరి వేతన కార్మికులకు సగం మొత్తం ఇవ్వాలని నిర్ణయించాను. ఇక్కడితో పూర్తి కాదు… నా శక్తి మేరకు చేస్తాను. మీ అందరికీ నేను చేసే విన్నపం ఒక్కటే… మీ చుట్టూ ఒకసారి చూడండి. మీ సహాయం అవసరమైనవారు ఉంటారు. వారిని ఆదుకోండి. ఒకరి జీవనాన్ని… జీవితాన్ని మీరు నిలిపే సమయం ఇది. ఒకరికి అండగా నిలవాల్సిన తరుణం ఇది అని ప్రకాశ్ రాజ్ ట్వీట్టర్‌లో స్పందించారు. జనతా కర్ఫ్యూ తర్వాత నాలో అనేక ఆలోచనలు మొదలయ్యాయి. చిన్న జీవితాలను ఆదుకోవాల్సిన అవసరం ఏర్పడిందని భావించాను. అందుకే నా వంతుగా, సామాజిక బాధ్యతగా నేను ముందుకు వచ్చాను. మనమంతా కలిసి బతుకుదాం అని ప్రకాశ్ రాజ్ ఓ సందేశాన్ని అందించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos