60 ప్రాంతాల్లో అనిశా దాడులు

60 ప్రాంతాల్లో అనిశా దాడులు

బెంగళూరు: రాష్ట్ర వ్యాప్తంగా 60 ప్రాంతాల్లో అవినీతి, ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 మంది అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికార్లు సోదాలు చేస్తున్నారు. 400 మంది సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొంటున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల్లో ఎగ్జిక్యూటవ్ ఇంజనీర్లు, రెవిన్యూ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల మేనేజర్లు, డైరెక్టర్లు, వైద్యాధికారులు కూడా ఉన్నారు. వారి ఇళ్లు, కార్యాలయాల్లో పత్రాలు పరిశీలిస్తున్న అధికారులు.. ఆస్తుల విలువను లెక్కించే పనిలో పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos