నాగళ్లు తీసుకొని రమ్మంటారా? కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై ఆప్ మండిపాటు

న్యూ ఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో ఎక్కువ మంది రైతుల్లాగే కనిపించడం లేదని కేంద్ర మంత్రి వీకే సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. ‘రైతుల నిరసనల్లో ఎక్కువ మంది రైతుల్లా కనిపించడం లేదు. నిరసనల వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం జరగ లేదు. నిజానికి వ్యవసాయ నూతన చట్టాలతో రైతులకు ఎలాంటి సమస్యా లేదు. ఇదంతా బయటి వ్యక్తులు చేస్తున్న పని. ఈ నిరసనల్లో కనిపించే వారంతా విపక్షాల కార్యకర్తలు రైతు కమిషన్ల సభ్యులు. వీళ్లే దీని వెనుక ఉండి నడిపిస్తున్నార’ని వీకే సింగ్ మంగళ వారం వ్యాఖ్యానించారు. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ‘వాళ్లు రైతులుగా కనిపించాలంటే ఎడ్ల బండ్లు, నాగళ్లు తీసుకుని రావాలా?’ని ట్విట్టర్ లో మండి పడింది. నిరసనకు అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు ప్రకటించినా రైతులు వెనుదిరగ లేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos