లక్నో : కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణఫై బాలీవుడ్ గాయికి కనికా కపూర్‌పై ఐపీసీ 188, 269, 270 సెక్షన్ల్ కింద ఇక్కడి ప్రకారం సరోజిని నగర్ పోలీసులు శని వారం కేసు నమోదు చేసారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం, గుమికూడి ఉండటం వంటి చట్టాల కిందా ఆమెపై మరో రెండు ప్రాథమిక సమాచార నివేదికలు దాఖలైనట్లు పోలీసు కమిషనరు సుజిత్ పాండే విలేఖ రులకు తెలిపారు. ఆమె కరోనా వ్యాధితో బాధ పడుతుండటం తెలిసిందే.