92 డిగ్రీల వద్దా వైరస్ సజీవం

92 డిగ్రీల వద్దా  వైరస్ సజీవం

పారిస్ : కరోనా వైరస్ 92 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్దా సజీవంగానే ఉంటుందని ఫ్రాన్స్ లోని మార్సెల్లీ విశ్వవిద్యాలయ ఆచార్యులు రెమీ చారెల్ తెలిపారు. 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కూడా వ్యాపి స్తుందన్నారు. 92 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 15 నిమిషాల పాటు బతుకుతుందని తమ పరిశోధనల్లో తేలిందని రెమీ తెలిపారు. 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గంట సేపు దాన్ని పరిశోధించినపుడు దాని వైరల్ కౌంట్ మాత్రమే తగ్గింది. వ్యాప్తి చెందే శక్తి మాత్రం అలాగే ఉందని చెప్పారు. 56 నుంచి 60 డిగ్రీల మధ్య కరోనా వైరస్ శక్తి కొంత మాత్రమే తగ్గిందన్నారు. వైరస్ లు పరిస్థితులకు తగ్గట్టు మార్పు చెందుతూ ఉంటాయని చెప్పారు. యూరప్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న దేశాల్లో కూడా కరోనా వ్యాప్తి చెందుతోందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos