వంగవీటి రాధకు కేఏపాల్ 100 కోట్ల భారీ ఆఫర్!

వంగవీటి రాధకు కేఏపాల్ 100 కోట్ల భారీ ఆఫర్!

మా పార్టీలోకి చేరు బ్రహ్మండమైన ప్యాకేజీ రెఢీగా ఉందంటూ లోగుట్టుగా ప్రపోజల్స్ పంపే పార్టీని చూశాం. కానీ.. ఒక టీవీ ఛానల్ కార్యక్రమంలో ఒక రాజకీయ నేతకు రూ.100 కోట్ల ఓపెన్ ఆఫర్ ఇవ్వటం ఎప్పుడైనా చూశామా?  కలలో కూడా ఊహించని రీతిలో మాట్లాడటం.. నచ్చినట్లుగా ప్రకటనలు చేయటంలో మొనగాడైన కేఏ పాల్ తాజాగా తన మాటలతో మరింత సంచలనం సృష్టించారు.

మత ప్రభోదకుడిగా సుపరిచితుడైన పాల్ తొలిసారి తాను ఏ సామాజిక వర్గానికి చెందిన వాడినో ఓపెన్ గా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. తన సామాజిక వర్గానికి చెందిన మరో నేతకు ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. తాను కాపు సామాజిక వర్గానికి చెందిన వాడినని చెప్పిన పాల్.. తనకు కులాల పట్టింపులు ఉండవన్నారు.తాను కాపు కులానికి చెందినప్పటికీ తన పెళ్లి ఒక దళిత అమ్మాయితో జరిగినట్లు వెల్లడించారు. కాపు వర్గానికి చెందిన వంగవీటి రాధా టీడీపీలో చేరటం సరికాదన్నారు. కొద్ది రోజుల క్రితం కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరు తనను కలిశారని.. వంగవీటి రాధాను టీడీపీలోకి వెళ్లకుండా ఆపాలని తనను కోరినట్లు పాల్ చెప్పారు.వంగవీటి రాధా తన పార్టీలో చేరాలని.. టీడీపీకి అమ్ముడుపోవద్దన్న ఆయన.. తండ్రిని చంపినోడి పార్టీలోకి వెళ్లటం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీలోకి చేరి వంగవీటి తప్పు చేయొద్దన్న పాల్.. తన పార్టీలో చేరితో ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ప్రకటించారు.  అంతేకాదు.. తమ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మంత్రి పదవిని ఇవ్వనున్నట్లు చెప్పారు. ఒకవేళ తాను ఇచ్చిన హామీని నెరవేర్చటంలో విఫలమైతే.. వంద కోట్ల రూపాయిలు ఇస్తానని భారీ ఆఫర్ ను ప్రకటించారు.వంద కోట్ల మొత్తాన్ని వంగవీటి రంగా పేరు మీద నడుస్తున్న ట్రస్టుకు విరాళంగా ఇస్తానని చెప్పారు. రాధా తండ్రిని టీడీపీనే చంపిందన్న ఆరోపణలున్న నేపథ్యంలో.. ఆ పార్టీలోకి రాధా చేరితే కాపులు ఎప్పటికీ క్షమించరని పాల్ వార్నింగ్ ఇవ్వటం గమనార్హం. మరి.. పాల్ బంపర్ ఆఫర్ పై వంగవీటి రాధా ఎలా రియాక్ట్ అవుతారో 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos