30 పిల్లలకు జన్మనిచ్చిన పులి

30 పిల్లలకు జన్మనిచ్చిన పులి

మధ్యప్రదేశ్‌లోని పెంచ్‌ నేషనల్‌ పార్క్‌లో ఓ పెద్దపులి రికార్డు నెలకొల్పింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 పిల్లలకు తల్లయ్యింది. సూపర్‌ మామ్‌ పేరుతో గుర్తింపు పొందిన ఈ పులి గతంలో ఏడుసార్లు తల్లి అయి 26 కూనలకు జన్మనిచ్చింది. తాజాగా ఎనిమిదోసారి నాలుగు కూనలకు జన్మనిచ్చి మొత్తంగా 30 కూనలకు తల్లిగా మారింది.ప్రస్తుతం పెంచ్‌ నేషనల్‌ పార్క్‌లో ఈ పులి తన నాలుగు కూనలతో పర్యాటకులకు కనువిందు చేస్తోంది. కొత్తగా పుట్టిన పులి కూనలు బుడి బుడిగా అడుగులు వేస్తుండటాన్ని చూస్తూ పర్యాటకులు ఎంజాయ్‌ చేస్తున్నారు. సూపర్ మామ్‌కు జన్మించిన పులి కూనలు పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉన్నాయన్నారు పెంచ్ నేషనల్ పార్క్ అధికారులు. వైల్డ్ లైప్ ఫొటోగ్రాఫర్లు ఈ పులుల ఫొటోలు తీశారు.పెంచ్ నేషనల్ పార్క్ అధికారుల వద్ద ఉన్న సమాచారం ప్రకారం ‘సూపర్ మామ్’ పులి 2005లో జన్మించింది. పులులు గర్భం ధరించిన 16 వారాలకు అంటే నాలుగు నెలలకు పిల్లల్ని కంటాయి. ఈ క్రమంలో నవంబర్ నెలలో గర్భం ధరించిన సూపర్ మామ్ తాజాగా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. పెద్ద పులుల సంరక్షణ కోసం ఇక్కడి అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అంతరించిపోతున్న అరుదైన పులులను సంరక్షిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos