మారణ హోమం సృష్టించాలని ప్రసంగాలా?’

న్యూ ఢిల్లీ : నవంబర్ 17-19 మధ్య హరిద్వార్, దిల్లీలో జరిగిన పలు హిందుత్వ సంస్థల కార్యక్రమాలు, వాటిల్లో చేసిన విద్వేష ప్రసంగాలపై స్వయం ప్రేరిత కేసుగా పరిగణిం చాలని చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు 76 మంది సుప్రీంకోర్టు న్యాయవాదులు లేఖ రాశారు. “ఆయా కార్యక్రమాల్లో చేసిన ప్రసంగాలు.. కేవలం విద్వేషపూరితం మాత్రమే కాదు. ఒక వర్గం మొత్తాన్నే హత్య చేయాలని పిలుపునిచ్చారు. దేశ ఐకమత్యానికి, లక్షలాది మంది ముస్లింలకు ఆ ప్రసంగాలు ముప్పు పొంచి ఉంది. సంబంధిత వ్యక్తులపై 120బీ, 121ఏ, 153ఏ, 153బీ, 295ఏ, 298 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి. గతంలోనూ ఇలాంటి ప్రసంగాలు మనం విన్నాము. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి ప్రసంగాలు ఇప్పుడు సాధారణమైపోయాయి. ఈసారి అలా జరగకూడదు. న్యాయవ్యవస్థ సత్వరమే జోక్యం చేసుకోవాలి. సీజేఐగా మీరు మీ సామర్థ్యాన్ని ఉపయోగించి చర్యలు చేపడతారని ఆశిస్తు న్నాము’అని కోరారు. గాజియాబాద్లోని ఒక ఆలయ ప్రధాన అర్చకుడు యతి నరసింహానంద్ సరస్వతి హరిద్వార్లో ,దిల్లీలో హిందూ యువవాహిని ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పలువురు విద్వేషపూరిత ప్రసంగాలు చేశారు. ఓ వర్గంపై మరణ హోమానికి పాల్పడాలని పిలుపునిచ్చారు. ఇవి దేశవ్యాప్తంగా కలకలాన్ని రేపాయి. అనేక మంది విపక్ష నేతలు వీటిని తప్పుబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos