ఉక్కు సంకల్పానికి 18 ఏళ్లు..

ఉక్కు సంకల్పానికి 18 ఏళ్లు..

నేటికి సరిగ్గా 18 ఏళ్ల క్రితం చిన్న కరపత్రంతో మొదలైన తిరుగుబాటు ఇంతింత వటుడింతై చందంగా ప్రజల్లోకి దూసుకెళ్లి ప్రత్యేక తెలంగాణ భావజాలాన్ని ప్రజల నరనరాల్లోకెక్కించి ఉవ్వెత్తున ఎగిసిపడే ఉద్యమాల బాట పట్టించి దశాబ్దల కల సాకారం చేసుకుంది.ఎన్ని అవాంతరాలు,అవమానాలు ఎదురైనా కదలని,చెదరని,బెదరని ఉక్కు సంకల్పంతో తెలంగాణ సాధించుకుంది.తెలంగాణ ప్రజలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉండాల్సిందేనన్న సంకల్పంతో సరిగ్గా 18 ఏళ్ల కిత్రం అంటే 27-04-2018వ తేదీన కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అలియాస్‌ కేసీఆర్‌ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు.కేవలం పార్టీని స్థాపించి నామమాత్రపు పోరాటాలు కాకుండా తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా ప్రజలను ముఖ్యంగా విద్యార్థులు,ఉద్యోగులను ఉద్యమం దిశగా నడిపించి విజయవంతమయ్యారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరగని పోరాటం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి 18 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తెరాస శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో తెరాస జెండాను ఆవిష్కరించి తెరాస నేతలకు,కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేటీఆర్ స్పెషల్ ట్వీట్ చేశారు.  27ఏప్రిల్ 2001న ఓ ధైర్య వంతుడి యాత్ర మొదలైందని..కేటీఆర్ తన తండ్రిని ఉద్దేశించి గర్వంగా ట్వీట్ చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా కేటీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.కేసీఆర్‌ మేనల్లుడు హరీశ్‌రావు కూడా తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ట్వీట్‌ చేశారు.పార్టీ 18వ ఆవిర్భావ దినోత్సవాన రాష్ట్రంలోనే కాదు.. వివిధ దేశాల్లో గులాబీ పతాకం రెపరెపలాడనున్నది. పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీఆర్‌ఎస్ ఎన్నారై శాఖలు సమాయత్తమయ్యాయి. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, బెహ్రెయిన్ తదితర దేశాలతోపాటు అనేక యూరప్ దేశాల్లో టీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు ఆ పార్టీ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos