15న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కూత

15న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కూత

భారత రైల్వే చరిత్రలోనే అత్యంత వేగవంతమైన రైలు ‘‘ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ’’ రైలు కూతపెట్టడానికి రెడీ అయ్యింది. ఫిబ్రవరి 15 ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఈ రైలును జెండా ఊపీ ప్రారంభించనున్నారు.పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన ఈ రైలుకు మొత్తం 16 బోగీలు ఉంటాయి. గంటలకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే  ఈ రైలు అన్ని రకాల పరీక్షలను ఎదుర్కొని రైల్వే సేఫ్టీ కమిషనర్‌ అనుమతితో ప్రయాణానికి రెడీ అయ్యింది.తొలుత దీనిని ‘‘ ట్రైన్ 18’’గా పిలిచారు. ఇటీవల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ దీని పేరును ‘‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌’’ గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఇది ఢిల్లీ-వారణాసి మధ్య ప్రయాణించనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos