28 రోజులకు శబరిమల ఆదాయమెంతో తెలుసా?

28 రోజులకు శబరిమల ఆదాయమెంతో తెలుసా?

దేశంలోని అన్నిఆలయాలపైకి శబరిమల ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంటుంది.శబరిమలకే కాదు అయ్యప్పమాలకు,శబరిమల ప్రసాదానికి కూడా ఎంతో ప్రాశస్త్యం ఉంది.భక్తుల కోర్కెలు తీర్చే దేవుడిగానే కాకుండా అన్నింటిలోనూ మేటిగా నిలిచే శబరిమల అయ్యప్ప ఆదాయార్జనలోనూ మేటిగా నిలిచాడు. సీజన్‌లో ఆలయం తెరిచిన 28 రోజుల్లోనే రూ.100 కోట్ల ఆదాయం స్వామివారి ఖాతాలో చేరింది.గత సీజన్ లో ఇదే సమయానికి అయ్యప్ప ఆదాయం కేవలం రూ.64 కోట్లే. నవంబరు 17 ఆలయం తెరుచుకోగా సరిగ్గా ఆదివారం సమయానికి దేవస్థానం ఆదాయం రూ.104.72 కోట్లకు చేరింది. గతేడాది మహిళల ప్రవేశం కారణంగా ఉద్రిక్త పరిస్థితుల చోటుచేసుకున్నాయి. దీంతో భక్తుల సంఖ్య తగ్గడంతో దాని ప్రభావం ఆదాయంపైనా పడింది.ఈ ఏడాది కూడా కొంత ఉద్రిక్తలు చోటు చేసుకున్నా ఆదాయం గణనీయంగా రావడం శబరిమల ప్రత్యేకతను చాటుకుంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos