హైపర్‌సోనిక్‌ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించిన చైనా

బీజింగ్‌: భవిష్యత్తు తరం హైపర్‌సోనిక్‌ డ్రోన్‌ తయారీ దిశగా చైనా కీలక ముందడుగు వేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ‘టర్బైన్‌ బేస్డ్‌ కంబైన్డ్‌ సైకిల్‌(టీబీసీసీ)’ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఇకపై దాన్ని విమానాలకు అమర్చి ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నారు. టీబీసీసీ ఇంజిన్‌ వ్యవస్థలో టర్బైన్‌, స్క్రామ్‌జెట్‌ ఇంజిన్‌ కలిసి ఉంటాయి. ఫలితంగా ధ్వనితో పోలిస్తే విమానం ఐదు నుంచి ఆరు రెట్లు ఎక్కువ వేగం(మ్యాక్‌ 6)తో ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది. సంప్రదాయ ఇంజిన్లతో పోలిస్తే టీబీసీసీ ఇంజిన్‌ పెద్దగా ఉంటుంది. దాని తయారీకి వ్యయమూ ఎక్కువే. ఈ ఇంజిన్‌ను అమర్చిన క్షిపణులను అడ్డుకోవడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos