హీరో పాత్రకు ఇస్ప్లిట్ పర్సనాలిటీ

  • In Film
  • January 31, 2019
  • 783 Views
హీరో పాత్రకు ఇస్ప్లిట్ పర్సనాలిటీ

గతంలో హీరో అంటే అన్నీ మంచి లక్షణాలే ఉండేవి.  అవకరాలు.. జబ్బులు అసలుండేవి కాదు.  ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. స్ప్లిట్ పర్సనాలిటీలు..ఓసీడీలు.. స్కిజోఫ్రెనియా..బధిరత్వం.. అంధత్వం.. ఒకటేమిటి? కాదేదీ క్యారెక్టరైజేషన్ కు అనర్హం అన్నట్టుగా ఉంది.   ఇలాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలు సాదిస్తుండడంతో ఫిలింమేకర్లు ఇలాంటి  క్యారెక్టరైజేషన్లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ లిస్టులో తాజాగా పూరి జగన్నాధ్ కూడా చేరాడని టాక్ వినిపిస్తోంది. పూరి దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమాను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే.  పూరి సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా బలంగా ఉంటుంది.  అదిప్పుడు రొటీన్ అయిపోయిందనే విమర్శలున్నాయి గానీ పూరి హీరోలలో ఒక స్టైల్ ఉంటుంది.. డోంట్ కేర్ యాటిట్యూడ్ ఉంటుంది. కానీ ఎప్పుడూ పూరి హీరోలకు జబ్బులు.. శారీరక బలహీనతలు లేవు. కానీ మొదటి సారి పూరి తన హీరో క్యారెక్టర్ కు స్ప్లిట్ పర్సనాలిటీ రుగ్మతను తగిలించాడట.అప్పుడెప్పుడో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ‘అపరిచితుడు’ లో విక్రమ్ పాత్రకు.. రీసెంట్ గా ‘అమర్ అక్బర్ అంటోనీ’ లో రవితేజ పాత్రకు మల్టిపుల్ పర్సనాలిటి డిజార్డర్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదేరకంగా రామ్ పాత్రకు స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుందట.  బ్లాక్ బస్టర్ కోసం పూరి ఈసారి డిజార్డర్ ను నమ్ముకున్నాడు.  తెలుగు తెరకు ఈ పాయింట్ కొత్తది కాకపోయినా పూరి సదరు డిజార్డర్ తో స్టొరీని ఎలా డ్రైవ్ చేస్తాడో వేచి చూడాలి.  

తాజా సమాచారం

Latest Posts

Featured Videos