హాంకాంగ్‌లో తెలుగువారి వనభోజనాలు

హాంకాంగ్‌లో తెలుగువారి వనభోజనాలు
హైదరాబాద్‌: కార్తీక మాసం అత్యంత పవిత్రం. అందుకే ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లోని ప్రజలు వన భోజనాలు చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. హాంకాంగ్‌లోని తెలుగు వారూ ఇదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. ది హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య (టీహెచ్‌కేటీఎస్‌) ఆధ్వర్యంలో వనభోజనాలు చేశారు. సంఘం అధ్యక్షురాలు జయ పీసపాటి, కార్యదర్శి బాల కిషోర్‌ మిర్యాల, కోశాధికారి వరప్రసాద్‌ నర్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. రవాణా, రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేశారు. ఆహ్లాదకర ఆటపాటలను నిర్వహించి బహుమతులు అందజేశారు.
హాంకాంగ్‌లోని ఆర్థిక, సమాచార సాంకేతిక సంస్థల్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. వీరిందరినీ టీహెచ్‌కేటీఎస్‌ ఒకే వేదిక మీదికి తీసుకొచ్చింది. ఏటా ఉగాది, సంక్రాంతి, సమూహిక సత్యనారాయణ వ్రతాలు, వన భోజనాలు నిర్వహిస్తోంది. వన భోజనాల సందర్భంగా దాదాపు 200 మంది ప్లొవెర్‌ కోవె రిజర్వాయర్‌ వద్ద కలుసుకొని ప్రకృతి అందాలను ఆస్వాదించారు. ఆటపాటలతో సరదాగా గడిపారు. తెలుగు సంస్కృతుల గురించి చర్చించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos