స్టాఫ్ కు దిల్ రాజు గిఫ్ట్

  • In Film
  • January 31, 2019
  • 731 Views
స్టాఫ్ కు దిల్ రాజు గిఫ్ట్

ఎఫ్ 2 సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో దిల్ రాజు ఆనందానికి అవథులు లేవు. అందుకే తనతో పాటు ఈ సినిమా కోసం కష్టపడిన ఇరవైమంది స్టాఫ్ కు కూడా ఓ ట్రీట్ ఇవ్వాలనుకున్నారు. విశాఖ, హైదరాబాద్ ల్లో మొత్తం 20 మంది స్టాఫ్ వున్నారు. వాళ్లందరినీ రేపు బ్యాంకాక్ టూర్ కు పంపిస్తున్నారు.ఇరవై మందిని తన స్వంత ఖర్చుతో నాలుగయిదు రోజుల పాటు బ్యాంకాక్ పర్యటనకు పంపిస్తున్నారు. ఎలాగూ ఏటా బోనస్ లు ఇవ్వడం లాంటివి మామూలే. ఈసారి సినిమా ఇంత పెద్ద హిట్ అయిన సందర్భంగా స్టాఫ్ ను ఈ విధంగా ఆనంద పెట్టాలని దిల్ రాజు డిసైడ్ అయ్యారు.దీనంతటికీ ఎలా లేదన్నా ఓ పాతిక లక్షల వరకు ఖర్చవుతుంది. కానీ స్టాఫ్ కు దానివల్ల వచ్చే ఆనందం కూడా తక్కువేమీ కాదు కదా. ఎఫ్ 2 సినిమా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోనే 60 కోట్ల మార్క్ కు చేరువైంది. ఈవారం అంతా కూడా సరైన సినిమా లేదు.ఇప్పటికీ రోజుకు ముఫై నుంచి నలభై లక్షల షేర్ వస్తోంది. వీకెండ్ వుండనే వుంది. అందువల్ల ఒక్క నైజాంలోనే ఈ వీకెండ్ తో కలిపి 23 కోట్ల మార్క్ దాటుతుందని అంచనా. దిల్ రాజుకు ఈ ఒక్క సినిమా మీదనే ముఫై నుంచి ముఫై అయిదు కోట్ల లాభం వచ్చే అవకాశం వుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos