సులువుగా డబ్బులు సంపాదించేందుకు యూట్యూబ్‌ చూసి

  • In Crime
  • January 24, 2019
  • 763 Views
సులువుగా డబ్బులు సంపాదించేందుకు యూట్యూబ్‌ చూసి

యూట్యూబ్‌ వీడియోలు చూసి నాటు తుపాకులను తయారు చేసిందో ముఠా… వాటితో బాటసారులను బెదిరించి దారిదోపిడీకి పాల్పడింది… చట్ట విరుద్ధమని తెలిసినా ఈజీ మనీకోసం దారితప్పారు… చివరకు పోలీసులు రంగంలోకి దిగడంతో వారి ఆట కట్టయ్యింది…
జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి సమీపంలో జరిగిన దారిదోపిడీ కేసును వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు ఛేదించారు. సంక్రాంతి రోజున అర్ధరాత్రి బ్రాందీషాపు మూసేసి వస్తున్న ముగ్గురు మద్యం దుకాణం నిర్వాహకులను నాటు తుపాకులతో బెదిరించిన ఆరుగురిని అరెస్టు చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి 5 లక్షల 56వేల రూపాయల నగదుతో పాటు 3 నాటు తుపాకులు, 10 బుల్లెట్లు, 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కొడకండ్ల మండలం మాంగ్యా చెరువు తండాకు చెందిన ఇస్లావత్‌ శంకర్‌, నల్గొండ జిల్లా పిట్టంపెల్లికి చెందిన నారబోయిన మల్లేశ్‌, అదే జిల్లాకు చెందిన గంగారపు స్వామి, జనగామ జిల్లా చెన్నూరుకు చెందిన పిట్టల శ్రీనివాస్‌, చీలూరి రమేశ్‌, నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం కొత్తపల్లికి చెందిన సరపంగి విప్లవ్‌లు ముఠాగా ఏర్పడి యూట్యూబ్‌లోని వీడియోల ద్వారా నాటు తుపాకులను తయారు చేసి ఈ దారి దోపిడీకి పాల్పడినట్లు తెలిపారు పోలీసులు.ఘటనాస్థలిలో పరిసరాల్లోని సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు పేర్కొన్నారు పోలీసులు. వారిలో స్వామి, శంకర్‌లు మాజీ నక్సలైట్లు కావడంతో తుపాకులపై అవగాహన ఉందని నిర్ధారించారు. వారిని విచారించగా సులువుగా డబ్బులు సంపాదించేందుకు యూట్యూబ్‌ చూసి తుపాకులు, బుల్లెట్లు తయారు చేశామని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు…

తాజా సమాచారం

Latest Posts

Featured Videos