సుమకు షాక్.. రాజీవ్ కు అంటగట్టిన అలీ

  • In Film
  • January 24, 2019
  • 145 Views
సుమకు షాక్.. రాజీవ్ కు అంటగట్టిన అలీ

అలీ.. ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గిపోయి టీవీ షో చేస్తున్నాడు.. సినిమాల్లోనూ అడపాదడపా కనిపిస్తున్నాడు. కానీ అంతకుమించి నోరు పారేసుకొని వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. అప్పట్లో సమంతపై కామెంట్ చేసిన అలీ చిక్కుల్లో పడ్డాడు. అనుష్క నడుం గురించి కూడా కామెంట్ చేసి నవ్వుల పాలయ్యాడు. తాజాగా మలయాళం సినిమా ‘ఒరు ఆధార్ లవ్’ తెలుగులో ‘లవర్స్ డే’గా వస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ బుధవారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది..

ఈ వేడుకకు యాంకర్ సుమ అలీలు వ్యాఖ్యతలుగా వ్యవహరించారు. వేదికపై వచ్చిన ప్రియా వారియర్ ను స్వతహాగా కేరళ వాసి అయిన యాంకర్ సుమ తన చెల్లెలుగా అభివర్ణించింది. అదే సమయంలో మైక్ అందుకున్న అలీ ‘ప్రియా వారియర్ నీ చెల్లెలు అయితే ఓకే.. మరి హీరో రోషన్ మీ కొడుకా’ అని సుమను ప్రశ్నించాడు. దీనికి కొడుకులాంటివాడే అని సుమ బదులిచ్చింది.. అప్పుడే అలీ నోరుజారాడు..‘రాజీవ్ ఎప్పుడు కేరళ వెళ్లాడు.. ఇంత పెద్ద కొడుకున్నాడు’ అని సుమ భర్త రాజీవ్ కనకాలపై అలీ అభ్యంతరకర సెటైర్ ను వేశాడు. ఈ మాట అనగానే అల్లు అర్జున్ నవ్వుతూ కిందకు తలదించుకోగా.. సుమ మాత్రం.. ‘నీ నోట్లో నోరు పెట్టాను చూశావా’ అంటూ ఈసడించుకొని వేరే టాపిక్ లోకి డైవర్ట్ అయ్యింది.ఇలా అలీ… రాజీవ్ కనకాల లకు కేరళలో సంబంధం అంటగట్టినట్టు మాట్లాడడం వివాదాస్పదమైంది. ఇదివరకే తన నోటి దూలతో పలు సమస్యలు తెచ్చుకున్న అలీ ఇప్పుడు తాజా మాటతో మరింత చిక్కుల్లో పడ్డాడు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos