సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే శారద కుంభకోణంపై విచారణ: రాజ్‌నాథ్‌

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే శారద కుంభకోణంపై విచారణ: రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ: కోల్‌కతాలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాజ్యాంగ విరుద్ధమని కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఈ అంశంపై సోమవారం పార్లెమెంట్‌లో ఆయన మాట్లాడుతూ గొలుసుకట్టు విధానాల ద్వారా ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు. జరిగిన కుంభకోణాలపై విచారణ జరుగుతోందని, విచారణ కోసం వెళ్లిన సీబీఐ అధికారులను.. బెంగాల్ పోలీసులు బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే శారద కుంభకోణంపై విచారణ జరుగుతోందని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్ పోలీసు కమిషనర్‌కు చాలాసార్లు సమన్లు అందించినా విచారణకు సహకరించలేదని రాజనాథ్ అన్నారు. కుంభకోణాల విచారణ నిష్పక్షపాతంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల మధ్య విభేదాలు సమాఖ్య స్ఫూర్తికి ప్రమాదమన్నారు. కోల్‌కతాలో పరిణామాలను చక్కదిద్దేందుకు గవర్నర్‌ చర్యలు చేపట్టారని, పరిస్థితులను చక్కదిద్దేలా చర్యలు చేపట్టాలని సీఎస్‌, డీజీపీలను గవర్నర్‌ ఆదేశించారని రాజనాథ్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos