సీబీఐ చీఫ్ కేసు నుంచి తప్పుకున్న ప్రధాన న్యాయమూర్తి

సీబీఐ చీఫ్ కేసు నుంచి తప్పుకున్న ప్రధాన న్యాయమూర్తి

న్యూఢిల్లీ: సీబీఐ తాత్కాలిక చీఫ్‌గా ఎం. నాగేశ్వరరావును నియమకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తప్పుకున్నారు. సీబీఐ నూతన డైరెక్టర్‌ను ఎన్నుకునే అత్యున్నత ఎంపిక కమిటీలో తాను కూడా సభ్యుడినైనందున ఈ కేసు నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. దీర్ఘకాలిక సెలవుపై పంపిన అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్‌ స్థానం నుంచి తొలగించి,  ఆయన స్థానంలో మళ్లీ తాత్కాలిక చీఫ్‌గా నాగేశ్వరరావును నియమించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నాగేశ్వరరావును ఎన్నుకోవడం ఇది రెండోసారి. అలోక్ వర్మను ఫైర్ సర్వీసులకు బదిలీ చేస్తూ సీబీఐ బాధ్యతలను మళ్లీ తిరిగి నాగేశ్వరరావుకు అప్పగించారు. కాగా సీబీఐ నూతన చీఫ్‌ను ఎన్నుకునేందుకు సెలక్షన్ కమిటీ ఈ నెల 24న సమావేశం కానుంది. ఈ కమిటీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ప్రధాన న్యాయమూర్తితో పాటు ప్రతిపక్షం తరపున కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కూడా ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos