సామ్ కోరి మరీ ఇరుక్కుందా?

  • In Film
  • January 31, 2019
  • 766 Views
సామ్ కోరి మరీ ఇరుక్కుందా?

మణికర్ణిక వివాదం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అంతు చిక్కడం లేదు. రిజల్ట్ పరంగా మిశ్రమ ఫలితాన్ని అందుకున్న ఈ వీరనారి సినిమా వసూళ్లు కూడా పర్వాలేదు అనేలా ఉన్నాయి తప్ప ఆశించిన స్థాయిలో మాత్రం లేవు. అయితే క్రిష్ కంగనాల మధ్య జరుగుతున్న ఆరోపణల పర్వం మాత్రం మీడియాలో అంతకు మించిన రేంజ్ లో హాట్ టాపిక్ గా మారింది. రెండు వర్గాల వైపు సపోర్ట్ వస్తోంది. క్రిష్ కు బాలీవుడ్ లో బేస్ లేదు కాబట్టి సహజంగానే కంగనాకు వత్తాసు పలుకుతున్న వారే ఎక్కువగా ఉన్నారు. పోతే అసలు ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయంలో టాలీవుడ్ పెద్దలు క్రిష్ మిత్రులు దీని గురించి ఎలా స్పందించాలో అర్థం కాక మౌనాన్ని ఆశ్రయించారు. ఇది విమర్శలకు దారి తీస్తోంది. మరోవైపు సమంతా ట్విట్టర్ లో మణికర్ణికను మెచ్చుకునే ఉద్దేశంతో కంగనా సోదరి రంగోలికి రిప్లై ఇస్తూ రెండు రోజులైనా మర్చిపోలేకపోతున్నానని అంత గొప్పగా సినిమా వచ్చిందని తెగ పొగడ్తలు కురిపిస్తూ రీ ట్వీట్ చేసింది. అయితే మెసేజ్ లో కంగనాకి సపోర్ట్ అనే పదం ఉపయోగించడంతో కొత్త చర్చకు అవకాశం దొరికినట్టు అయ్యింది.సమంతా ఉద్దేశం ఏదైనా ఉన్నప్పటికీ ఇలా డైరెక్ట్ గా ట్వీట్ చేయకుండ రంగోలికి రిప్లై ట్వీట్ పెట్టడంలో పరమార్థం బయటికి మాత్రం స్పష్టంగానే ఉంది. వివాదం విషయంలో నేను కంగనా వైపు ఉన్నట్టే అని చెప్పకనే చెప్పింది. ఒకవేళ అలాంటి ఉద్దేశం లేకపోతే మణికర్ణికను పొగుడుతూ విడిగా ట్వీట్ చేస్తే ఇప్పుడీ డిస్కషన్ ఉండేది కాదు. రంగోలిని అడ్రెస్ చేసి మెచ్చుకోవడం వల్లే ఇప్పుడీ తంటా వచ్చింది.క్రిష్ కు అసలే టాలీవుడ్ నుంచి ఈ విషయంగా మద్దతు లేదే అని అతని అభిమానులు కలవరచెందుతున్న తరుణంలో సామ్ ఇలాంటి ట్వీట్ తో వేడిని ఇంకాస్త పెంచింది. నిజానికి ఇది తప్పేమీ కాదు కాని క్రిష్ ఇలాంటి ఇబ్బందికరమైన పరిణామంలో ఉన్నప్పుడు టాలీవుడ్ ఆర్టిస్ట్ గా ఇలా ట్వీట్ చేయకుండా ఉండాల్సింది అనేది ఫ్యాన్స్ అభిప్రాయం. ఇన్ని పరిచయాలున్నా క్రిష్ కు సపోర్ట్ గా నిర్మాతల సమాఖ్య దర్శకుల సంఘం ఏ ఒక్కరు చిన్న మాట కూడా అనకపోవడం గమనార్హం..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos