షర్మిలపై దుష్ప్రచారం.. ఆరుగురిని పట్టుకున్న పోలీసులు

షర్మిలపై దుష్ప్రచారం.. ఆరుగురిని పట్టుకున్న పోలీసులు

వైఎస్‌ షర్మిలపై సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిలో ఆరుగురిని గుర్తించిన సైబర్‌ క్రైం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారికి 41(ఎ) నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం 15 సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌లను గుర్తించిన పోలీసులు మిగతా వారికి కూడా నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. యూట్యూబ్‌ నుంచి వివరాల కోసం వేచి చూస్తున్నారు. వివరాలు రాగానే తదుపరి చర్యలుంటాయని సైబర్‌ క్రైం అదనపు డీసీపీ రఘువీర్‌ తెలిపారు. హీరో ప్రభాస్‌తో తనకు సంబంధముందని సోషల్‌ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్‌ షర్మిల ఈ నెల 14న హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దుష్ప్రచారానికి పాల్పడ్డారనే అనుమానాలతో యూట్యూబ్‌లో మొత్తం 15 వీడియో లింకుల్ని పోలీసులు గుర్తించారు. అవి ఏయే ఐపీ అడ్రస్‌ల ద్వారా అప్‌లోడ్‌ చేశారో వివరాలు సేకరించి వాటి ఆధారంగా బాధ్యుల్ని గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరంతా హైదరాబాద్‌ వాసులేనని ప్రాథమికంగా గుర్తించారు.

తాజా సమాచారం