శివకుమారస్వామి పరిస్థితి విషమం…

శివకుమారస్వామి పరిస్థితి విషమం…

బెంగళూరు : శ్రీ సిద్ధగంగా మఠాధిపతి శివకుమారస్వామి పరిస్థితి విషమంగా ఉందని సోమవారం ఉదయం వైద్యులు ప్రకటించారు. వెంటిలేటరుపై ఉన్న స్వామిజీ ఆరోగ్య పరిస్థితి గత రాత్రి కంటే మారిందని డాక్టర్ పరమేశ్వర్ చెప్పారు. లింగాయత్ వీరశైవులు తమ ఆరాధ్య దైవంగా పూజించే శివకుమార స్వామి వయసు 111 ఏళ్లు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల స్వామికి డిసెంబరు 8వతేదీన వైద్యులు ఆపరేషన్ చేశారు. శివకుమారస్వామి ఆరోగ్యం విషమించిందని వైద్యులు చెప్పడంతో మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్ప సోమవారం తన కార్యక్రమాలను రద్దు చేసుకొని తుముకూరులోని మఠానికి బయలు దేరారు. శివకుమార్ స్వామి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా పోలీసులు సిద్ధగంగా మఠం వద్ద పోలీసుల భద్రతను పెంచారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వర సిద్ధగంగా మఠానికి తరలివచ్చారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos