విడుదలైన అభినందన్

విడుదలైన అభినందన్

ఇస్లామాబాద్: భారత వైమానిక దళం (ఐఏఎఫ్) పైలట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పాక్ అధికారులు ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు శుక్రవారం మధ్యాహ్న్ం  అప్పగించారు. సాయంత్రం 3-4 గంటల మధ్య ఆయన అట్టారీ-వాఘా సంయుక్త తనిఖీ కేంద్రం ద్వారా జన్మభూమిపై కాలు మోపనున్నారు. బుధవారం జమ్మూ- కశ్మీర్‌లోని సైనిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించిన పాకిస్తాన్ వైమానిక దళాన్ని తిప్పికొట్టే క్రమంలో ఐఏఎఫ్‌‌కి చెందిన మిగ్21 యుద్ధ విమానం ఒకటి పాక్ భూ భాగంలో కూలిపోయింది. దాని పైలెట్‌ వింగ్‌ కమాండర్‌ అభినంద్‌న్‌ వర్థమాన్‌ను పాకిస్తాన్బంధించారు జెనీవా ఒప్పందం ప్రకారం ఆయనను వెంటనే బేషరతుగా స్వదేశానికి తిప్పి పంపాలంటూ భారత్ అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఇరు దేశాల మధ్య శాంతిని ఆకాంక్షిస్తూ అభినందన్‌ను విడుదల చేస్తామని  పాక్ ప్రధాని ఇమ్రాన్ గురువారుం పాక్‌ పార్లమెంటులో ప్రకటించారు.దరిమిలా శుక్రవారం విడుదలకు రంగం సిద్ధమైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos