రూ.3 లక్షల కోట్లు రాబట్టాం : పీయూష్

రూ.3 లక్షల కోట్లు రాబట్టాం : పీయూష్

న్యూఢిల్లీ : 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను పీయూష్ గోయల్ శుక్రవారం లోక్‌సభకు సమర్పించారు. పీయూష్ మాట్లాడుతూ రుణాలను చెల్లించని రుణగ్రస్థుల నుంచి రూ.3 లక్షల కోట్లు తిరిగి రాబట్టినట్లు తెలిపారు. ఈ సొమ్మును బ్యాంకులకు సమకూర్చినట్లు తెలిపారు. బ్యాంకింగ్‌ను ప్రక్షాళన చేసినట్లు పేర్కొన్నారు. అధిక వృద్ధి సాధించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పారదర్శకతలో కొత్త పుంతలు తొక్కుతున్నట్లు చెప్పారు. ఆరం్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్టు చెప్పారు. కరెంట్ ఖాతా లోటు 2.5 శాతం ఉందని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజనకు భారీగా నిధులు సమకూర్చినట్లు తెలిపారు. భారత దేశ వనరులను పేదలు మొదట అనుభవించగలిగేలా చేస్తున్నామన్నారు. గ్రామీణ రోడ్ల నిర్మాణాన్ని మూడు రెట్లు పెంచినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో ఉండే సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పేదలకు ఆహారం అందజేయడానికి రూ.1.7 లక్షల కోట్లను కేటాయించినట్లు చెప్పారు.గత ప్రభుత్వాలు కేవలం ఉత్తుత్తి వాగ్దానాలను మాత్రమే చేశాయని ఆరోపించారు.  
చిన్నకారు రైతులకు రాబడి పథకం 

చిన్న కారు రైతుల ప్రయోజనం కోసం 2019-20 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్‌లో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. 12 కోట్ల మంది రైతులు దీనివల్ల ప్రయోజనం పొందుతారని పీయూష్ గోయల్ తెలిపారు. నేరుగా రైతుల ఖాతాల్లోకే సొమ్ము చేరే విధంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు చెప్పారు. ఈ పథకం 2018 డిసెంబరు నుంచి అమల్లోకి వస్తుందన్నారు. రైతు కుటుంబాలు ఈ పథకం వల్ల సంతోషంగా జీవించాలన్నదే తమ లక్ష్యమన్నారు. వ్యవసాయ ఆదాయ మద్దతు పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం రూ.6,000 నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచే 2022 నాటికి కొత్త భారతదేశం దిశగా మేం చర్యలు తీసుకుంటున్నాం.ప్రతి ఒక్కరూ తమ స్వప్నాలను సాకారం చేసుకునేలా అవకాశాలు కల్పిస్తున్నాం.గత ఐదేళ్లలో భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. దేశంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న దేశం మనది. ఇప్పుడు మనది ప్రపంచంలోనే 6వ శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ.ఆర్థిక సంస్కరణలు అమలైన తర్వాత ఏ ప్రభుత్వం సాధించనంత వృద్ధి సాధించాం.అవినీతి లేని ప్రభుత్వాన్ని మేం నడిపించాం. పాలనలో పారదర్శకత తీసుకొచ్చాం.ఉన్నత వర్గాల్లోని పేదల కోసం పది శాతం రిజర్వేషన్లు కల్పించాం.గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాన్ని మూడు రెట్లు పెంచాం.దేశంలో 2014 నుంచి 2018వ సంవత్సరం వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా 1.53 లక్షల ఇళ్లు నిర్మించాం.దేశంలో దాదాపు 50 కోట్ల మంది ప్రజల కోసం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టాం. ప్రపంచంలోనే అత్యంత భారీ ఆరోగ్య పథకం ఇది. దీనివల్ల పేద ప్రజలకు రూ.3 వేల కోట్ల సొమ్ము ఆదా అవుతుంది.దేశంలో 21 ఎయిమ్స్ (ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్) ఉండగా.. 22వ ఎయిమ్స్‌ను హరియాణాలో ఏర్పాటు చేయనున్నాం. వీటిలో 14 ఎయిమ్స్‌లను మా హయాంలోనే మొదలు పెట్టాంమని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos