యడ్యూరప్ప వ్యాఖ్యలు గర్హనీయం

ఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన మెరుపు దాడుల గురించి కర్నాటక భాజపా అధ్యక్షుడు యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత అమిత్ షా శుక్రవారం ఆక్రోశించారు. యడ్యూరప్ప మెరుపు దాడులకు రాజకీయ రంగు పులమటం అసమంజసం, ఎంత మాత్రమూ సమర్థనీయం కాదని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరుగుతున్న ఒక ఆంగ్ల పత్రిక శిఖరాగ్ర సమావేశంలలో పాల్గొన్న ఆయన ఓ ప్రశ్నకు ఈ మేరకు స్పందించారు. భారత్ నిర్వహించిన వైమానిక దాడులు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో  భాజపాకు రాజకీయ లబ్ధిని చేకూరుస్తుందని, కర్నాటకలో భాజపా అభ్యర్థులు 22లోక్‌సభ స్థానాల్లో గెలవటం  ఖాయమని యడ్యూరప్ప సంతోషాన్ని వ్యక్తీకరించటం అందరికీ తెలిసిందే. పుల్వామా ఉగ్ర దాడి నుంచి  దేశ ప్రజలు తేరుకోక ముందే యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపింది. పాక్‌ కూడా ఇదీ భాజపా అసలు రంగని ఎద్దేవా చేసింది.  

       దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల తీరు
ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదన్నారు. గతంలో తమ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దేశం
సంక్షోభంలో ఉంటే నాటి ప్రభుత్వం తరపున నిలబడిందని పేర్కొన్నారు. ఇప్పుడు పుల్వామా
ఉగ్రదాడికి కారణమైన జైషే మహ్మద్ మూకలపై ఐఏఎఫ్ దాడులు నిర్వహిస్తే ప్రతిపక్షాలు
చర్చల పేరుతో గగ్గోలు పెడుతున్నాయని ఆరోపించారు. తీవ్రవాదం పరిష్కారానికి చర్చలే
మార్గమైతే. ఇంత వరకూ ఎందుకు పరిష్కారం కాలేదని ప్రశ్నించారు. తీవ్రవాదాన్ని అంత మొందించడంపై
పాకిస్తాన్ తన మాట నిలబెట్టు కోవాలని కోరారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్
ఖాన్ ఇప్పటి వరకు పుల్వామా ఉగ్రదాడికి ఖండించక పోవడానికి కారణమేంటని ప్రశ్నించారు.

            భారత్‌ మాజీ ప్రధాని జవహర్‌లాల్‌
నెహ్రు నిర్ణయం వల్లే కశ్మీర్‌ సమస్య జటిలమైందని అభిప్రాయపడ్డారు. 1947లో నెహ్రు
కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి పెద్ద తప్పిదం చేశారని, ప్రస్తుత
పరిస్థితులకు అదే కారణమని విశ్లేషించారు.  కశ్మీర్‌ సమస్య శాశ్వత పరిష్కారానికి
నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషిచేసో్దన్నారు . రాజ్యాంగంలో ౩౭౦ అధీకరణ, , 35-ఏ మార్పుల
గురించి బదులివ్వలేదు. పుల్వామా ఉగ్రదాడి, భారత వాయుసేన మెరుపు దాడిని ఎన్నికల
ప్రచారానికి సాధనాలుగా వాడుకోమని స్పష్టీకరించారు. అభివృద్ధి ప్రణాళికతోనే
ఎన్నికలు వెళ్తామన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos