మోదీది ఓవర్ యాక్షన్‌: దేవేగౌడ

మోదీది ఓవర్ యాక్షన్‌: దేవేగౌడ

బెంగళూరు: కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను అరెస్ట్ చేయాలనుకోవడం ద్వారా సీబీఐ తన అధికారాలను దుర్వినియోగపరిచిందని మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ మండిపడ్డారు. ఎమర్జెన్సీ కంటే ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. గత రాత్రి నుంచి జరుగుతున్న ఘటనలు దురదృష్టకరమన్నారు. సీబీఐని ఉపయోగించి ప్రధాని మోదీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారని విమర్శించారు. ఈ చర్యలు వచే్చ్చే లోక్‌సభ ఎని్న్పికలలో మోదీకి ఏమాత్రం ఉపకరించవన్నారు.
పశ్చిమబెంగాల్‌లో ప్రస్తుత పరిస్థితులు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయని దేవేగౌడ అభిప్రాయ పడ్డారు. శారద, రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్‌ కుంభకోణాల కేసులో కోల్‌కతా నగర పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ను అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన సిబిఐల వైఖరిపై రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య భారీ ప్రతిష్టంబన నెలకొన్న సంగతి తెలిసిందే. కేంద్ర వైఖరిని నిరసిస్తూ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేపడుతున్న దీక్ష 15 గంటలు దాటింది. అక్కడ పరిస్థితులపై తెలుసుకొని తాను ఆశ్చర్యానికి గురయ్యానని ఆయన అన్నారు. ఆమెకు మద్దతునిస్తున్నట్లు చెప్పారు. అత్యవసర పరిస్థితి సమయంలో ఇటువంటి రాజ్యాంగ విరుద్ధమైన పరిస్థితులు దేశం ఎదుర్కొందని, ప్రస్తుతం ఆ పరిస్థితికి పశ్చిమబెంగాల్‌ చేరుకుందని జెడిఎస్‌ నేత ట్వీట్‌ చేశారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos