మేడా ఆఫీస్ లో పత్రాలు ధ్వంసం

మేడా ఆఫీస్ లో పత్రాలు ధ్వంసం

మేడ మల్లికార్జున రెడ్డి ఇలా వైసీపీలో చేరారో లేదో అప్పుడే ఆయనపై కక్షసాధింపు చర్యలకు దిగింది తెలుగుదేశం పార్టీ. అసెంబ్లీలో మేడాకు చెందిన ఛాంబర్ లో కీలకమైన ఫైల్స్ ను తెలుగుదేశం పార్టీ సభ్యులే ధ్వంసం చేశారని ఆరోపిస్తోంది. వైసీపీ.  మేడా కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాదు – టీడీపీ ప్రభుత్వ విప్ కూడా. ప్రభుత్వ కార్యకలాపాలకు చెందిన ఎన్నో ఫైల్స్ మేడా ఛాంబర్ లో ఉన్నాయి. వాటిలో బయటకు రాని కొన్ని వివరాలు – కేబినెట్ భేటీకి సంబంధించిన కీలక సమాచారం కూడా ఉంది. అవన్నీ ఎక్కడ బయటకొస్తాయేమో అనే భయంలో ఆగమేఘాల మీద వాటిని టీడీపీకి చెందిన నేతలు ధ్వంసం చేశారని వైసీపీ ఆరోపిస్తోంది.

మేడాను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నిర్ణయం వెలువడిన కొన్ని గంటలకే చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా జగన్ వద్దకెళ్లి – వైసీపీలో చేరిపోయారు మేడా. దీంతో తెలుగుదేశం పార్టీ కంగుతింది. మేడా వైసీపీలో చేరుతారని టీడీపీకి తెలుసు. కానీ ఇలా గంటల వ్యవధిలో ఈ మార్పు సంభవిస్తుందని ఆ పార్టీ ఊహించలేకపోయింది. ఈ చర్యకు ప్రతీకారంగా మేడా ఆఫీస్ లో కీలకమైన పత్రాల్ని ధ్వంసం చేశారని వైసీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.ధ్వంసమైన పత్రాల్లో ఏమున్నాయనే విషయంపై ఎవరికీ స్పష్టత లేదు. కాకపోతే అందులో ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారం ఉందని – చంద్రబాబు ఆదేశాల మేరకే ఆ పత్రాలు ధ్వంసమయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

తాజా సమాచారం

Latest Posts

Featured Videos