మెరీనా బీచ్‌లో పిల్లలు స్నానం చేస్తే తల్లిదండ్రులపై కేసు

  • In Crime
  • February 4, 2019
  • 141 Views
మెరీనా బీచ్‌లో పిల్లలు  స్నానం చేస్తే తల్లిదండ్రులపై కేసు

చెన్నై: స్థానిక మెరీనా బీచ్‌లో పిల్లలు స్నానం చేస్తే వారి తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని నగర జాయింట్‌ కమిషనర్‌ బాలకృష్ణన్‌ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో… బీచ్‌లో స్నానం చేయడంపై ప్రభుత్వ నిషేధాజ్ఞలు విధించినా పర్యాటకులు స్నానాలు చేస్తుండడంతో పలువురు అలల ధాటికి గల్లంతవుతున్నారన్నారు. దీనిపై దృష్టి సారించిన పోలీస్‌ శాఖ పర్యాటకులు బీచ్‌లో స్నానాలు చేయాలని, లోతట్టు ప్రాంతాలకు వెళ్లరాదని హెచ్చరించడంతో పాటు వాహనాలు, గుర్రాలపై పోలీసులు గస్తీ చేపడుతున్నారు. ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితం మెరీనాలో స్నానానికి వెళ్లిన ముగ్గురు విద్యార్థులు నీటమునిగి మృతి చెందారు. దీంతో, ప్రత్యేక దృష్టి సారించిన పోలీస్‌ శాఖ, 18 ఏళ్లలోపున్న పిల్లలను బీచ్‌కు తీసుకొచ్చే తల్లిదండ్రులు వారిని పర్యవేక్షించాలని కోరారు. సముద్రంలో స్నానానికి పిల్లలను అనుమతించరాదని, అలాగే పిల్లలను ఒంటిరిగా బీచ్‌కు పంపించరాదని కోరారు. కొందరు పిల్లలు పాఠశాలకు వెళు తున్నామని తల్లిదండ్రులకు చెప్పి బీచ్‌కు వెళుతున్నారని, పాఠశాలకు రాని విద్యార్థుల వివరాలను ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించాలన్నారు. ఇకపై, బీచ్‌లో పిల్లలు స్నానం చేస్తే వారి తల్లిదండ్రులపై చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos