మాంసం వినియోగంలో తెలంగాణ నం.1

మాంసం వినియోగంలో తెలంగాణ నం.1

మాంసం వినియోగంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని ఓ కథనం .గొర్రెల సంఖ్యలో కూడా తెలంగాణ ప్రథమ స్థానం సాధించింది. ఇప్పటివరకు మొదటిస్థానంలో ఉన్న రాజస్థాన్‌ను వెనుకకు నెట్టింది. తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి.డిసెంబర్ 31తో ముగిసిన జాతీయ పశుగణన నివేదిక ఈ విషయాన్ని స్పష్టంచేసింది.రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ పథకంతో గ్రామాల్లో గొల్ల, కుర్మ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమయ్యాయి.రాష్ట్ర ప్రభుత్వం గొల్ల, కుర్మలకు గొర్రెల పంపిణీ పథకం అమలుచేసే (2017 జూన్ 20న) నాటికి రాష్ట్రంలో గొర్రెల సంఖ్య కోటి మాత్రమే ఉండేది. ఇతర రాష్ట్రాల నంచి 74 లక్షల గొర్రెలను కొనుక్కొచ్చి ప్రభుత్వం వాటిని గొల్ల, కుర్మలకు పంపిణీ చేసింది. వీటికి 55 లక్షల పిల్లలు పుట్టాయి.డిసెంబర్ 31 నాటికి ఇతర ప్రాంతాలకు విక్రయించినవి, వివిధ కారణాలతో మృతి చెందినవి, మాంసానికి వినియోగించినవి మినహాయించగా.. తెలంగాణలో 2.24 కోట్ల గొర్రెలు ఉన్నట్టు జాతీయ పశుగణన శాస్త్రీయ నివేదిక తెలిపింది. రాజస్థాన్‌లో దాదాపు 2 కోట్ల గొర్రెలు ఉన్నాయి.సగటున ప్రతివ్యక్తి ఏడాదికి 7.5 కిలోల మాంసం వినియోగిస్తున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణలో 97 శాతం మంది మాంసాహారులే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos