బెజవాడలో శ్రీనివాసరావుకు ముప్పు: రాజమండ్రి జైలుకు తరలింపు

బెజవాడలో శ్రీనివాసరావుకు ముప్పు: రాజమండ్రి జైలుకు తరలింపు

విజయవాడ: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును రాజమండ్రి జైలుకు తరలించాలని కోర్టు శుక్రవారం నాడు ఆదేశించింది. ఈ నెల 25వ తేదీ వరకు శ్రీనివాసరావుకు రిమాండ్ విధించింది కోర్టు. గతంలో విజయవాడ కోర్టులో శ్రీనివాసరావు ఉండేవాడు. వారం రోజుల క్రితం విజయవాడ కోర్టు నుండి  శ్రీనివాసరావును ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకొంది.అయితే ఇవాళ విజయవాడ కోర్టులో  శ్రీనివాసరావు తరపున న్యాయవాదులు పలు అంశాలను కోర్టు దృష్టికి తెచ్చారు. జగన్‌పై దాడికి సంబంధించిన విషయమై మీడియాతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.మరో వైపు జైలులో ఉన్న సమయంలో శ్రీనివాసరావు రాసుకొన్న 24 పేజీల లేఖను  తనకు ఇప్పించాలని కూడ శ్రీనివాసరావు న్యాయవాదులు కోరారు.అయితే ఈ రెండు అంశాలను విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు తోసిపుచ్చింది. కేసు విచారణ సాగుతున్న సమయంలో  నిందితుడుగా ఉన్న శ్రీనివాసరావు కేసు విషయమై మీడియాతో మాట్లాడితే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని ఎన్ఐఏ తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు విన్పించారు.ఎన్ఐఏ వాదనతో కోర్టు ఏకీభవించింది.  కేసు విచారణ సాగుతున్న సమయంలో  ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడడం సరైంది కాదని కోర్టు అభిప్రాయపడింది.మరోవైపు జైలు మాన్యువల్ ప్రకారంగా  ఖైదీలుగా ఉన్నవారికి సంబంధించిన వస్తువులను జైలు అధికారులు స్వాధీనం చేసుకొంటారని కోర్టు అభిప్రాయపడింది. జైలు నుండి విడుదలయ్యే సమయంలో  ఖైదీల వస్తువులు తిరిగి ఇచ్చే అవకాశం ఉందని కోర్టు తేల్చి చెప్పింది.జగన్‌పై దాడికి సంబంధించి న కేసులో  శ్రీనివాసరావుకు విజయవాడ జైలులో భద్రత ఉండదని ఆయన తరపు న్యాయవాదులు భావించారు.రాజమండ్రి  లేదా విశాఖ జైలుకు  తరలించాలని  కోరారు.నిందితుడి తరపున న్యాయవాది కోరిక మేరకు  రాజమండ్రి జైలుకు తరలించాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos