బీసీల‌ను దూరం చేసేందుకు కుట్ర

బీసీల‌ను దూరం చేసేందుకు కుట్ర

టిఆర్‌య‌స్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ – వైసిపి అధినేత జ‌గ‌న్ స‌మావేశం పై టిడిపి ఇంకా విమర్శ‌లు గుప్పిస్తూనే ఉంది. అందు లో భాగంగా..టిడిపి అధినేత చంద్ర‌బాబు మ‌రో సారి ఈ అంశాన్ని ప్ర‌స్తావించారు. టిడిపి కి బీసీల‌ను దూరం చేసేందుకు కుట్ర జ‌రుగుతోంద‌ని ఆరోపించారు. వైయ‌స్ ను తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆ రాష్ట్ర శాన‌స‌భ స‌భ‌లో కీర్తించ‌టం పైనా ముఖ్య‌మంత్రి స్పందించారు. మోదీ డైరెక్ష‌న్ లో ఇవ‌న్నీజ‌రుగుతున్నాయ‌ని మండి ప‌డ్డారు..
వైసిపి – టిఆర్‌య‌స్ కుట్ర‌..
ఏపిలోని బీసీల్లో అపోహ‌లు తేవాల‌ని వైసిపి..టిఆర్‌య‌స్ కుట్ర‌లు చేస్తున్నాయ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆరోపిం చారు. బీసీల‌ను టిడిపికి దూరం చేయాల‌ని కుతంత్రాలు చేస్తున్నార‌ని..దీని పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పార్టీ నేత‌ల కు దిశా నిర్దేశం చేసారు. బీసీలే సంఘటితంగా కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. తాజాగా, తెలంగాణ మంత్రి త‌ల‌సానికి ఏపిలో య‌ద‌వ సంఘాల నేత‌లు ఘ‌నంగా ఆహ్వానం ప‌ల‌కటం పైనా ముఖ్య‌మంత్రి ఆగ్ర‌హించారు.

చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ప్ర‌చారం..
తెలంగా ణ నేత‌ల కార్య‌క్ర‌మాల్లో ఎవ‌రూ పాల్గొన‌వ‌ద్ద‌ని ఆదేశించారు. తాజాగా, త‌ల‌సాని తాను ఏపి లో ప‌ర్య‌టిస్తాన‌ని.. ఎన్నిక ల్లోప్ర‌చారం చేస్తాన‌ని స్ప‌ష్టం చేసారు. అదే విధంగా..ఏపిలోని యాద‌వ‌, గౌడ తో పాటుగా ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌తో తెలంగాణలోని ఆ సామాజికవ‌ర్గ ప్ర‌ముఖ నేత‌లు స‌మావేశాలు నిర్వ‌హించి..చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేసేందుకు సిద్దం అవుతున్నార‌ని టిడిపి నేత‌లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో..ముందుగానే చంద్ర‌బాబు టిడిపి నేత‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. టిడిపికి కీల‌క‌మైన బిసి ఓటు బ్యాంకు పై ఎటువంటి ప్ర‌భావం ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.
రెండో సంత‌కం కేసీఆర్ దే.. ఇక ఇదే సంద‌ర్భంలో తాజాగా తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ దివంగ‌త ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను కీర్తిం చ‌టం పైనా చంద్ర‌బాబు స్పందించారు. గతంలో వైఎస్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిందించారని.. రాజా ఆఫ్ కర ప్షన్‌ పుస్తకంపై కేసీఆర్‌దే రెండో సంతకమని దుయ్యబట్టారు. ఇప్పుడు అదే కేసీఆర్‌ వైఎస్‌ను పొగుడుతున్నారని విమర్శించారు. వైసిపి -టిఆర్‌య‌స్ మ‌ధ్య సంబంధాలు బ‌ల ప‌డుతున్నాయ‌నే దానికి ఇదే ఉదాహ‌ర‌ణ గా పేర్కొంటు న్నారు. వైయ‌స్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ప్ర‌వేశ పెట్టిన ఆరోగ్య శ్రీ ప‌ధ‌కాన్ని కేసీఆర్ ప్ర‌శంసించారు. ఎవ‌రు మంచి చేసినా అభినందించ‌టానికి ఎటువంటి బేష‌జాలు లేవ‌ని చెప్పుకొచ్చారు. ఇక‌, ఇప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్య ల ద్వారా వైసిపి – టిఆర్‌య‌స్ బంధాన్ని మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని టిడిపి యోచిస్తోంది. తెలంగాణ లో కేసీఆర్ ఏ ర‌కంగా టిడిపి-కాంగ్రెస్ బంధం పై త‌న వ్యూహాన్ని అమ‌లు చేసారో..అదే విధంగా ఏపి లో చంద్ర‌బాబు త‌న వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నారు.

తాజా సమాచారం