బాబు నిజం – అబద్ధంపై నాగాబాబు కామెంట్

బాబు నిజం – అబద్ధంపై నాగాబాబు కామెంట్

మెగా బ్రదర్ నాగబాబు సునిశిత విమర్శలతో విడుదల చేస్తున్న తన సెటైరికల్ వీడియోలు సంచలనం రేపుతున్నాయి. రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ కామెడీ జనరేట్ చేసేలా.. అదే సమయంలో వారి అసహాయతను ఎద్దేవా చేసేలా ఉన్న ఈ వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఇటీవల వరుసగా నందమూరి బాలక్రిష్ణ నారా లోకేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిలను టార్గెట్ చేసి వీడియోలు విడుదల చేసిన నాగబాబు.. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును టార్గెట్ చేశారు.

తాజాగా మెగా బ్రదర్ నాగబాబు.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నోరుజారిన ఓ మాటను తీసుకొని సెటైర్ వేశారు. ‘ఈరోజు భారత దేశం మొత్తం మీద ఒకసారి చూస్తే.. అవినీతిలో కానీ.. అభివృద్ధిలో కానీ మొదటి స్థానంలో ఉన్నాం’ అని చంద్రబాబు ఓ సందర్భంలో మాట తూలారు. ఈ డైలాగ్ పై నాగబాబు ప్రజలకు సవాల్ విసిరారు. చంద్రబాబు చేసిన ఈ ప్రకటనలో ఒక నిజం ఉంది.. ఒక అబద్ధం ఉంది చెప్పుకోండి చూద్దాం అంటూ ప్రజలను ప్రశ్నించారు.చివరగా సమాధానం దొరకకపోతే తానే చెబుతానంటూ పైన ప్రశ్నకు నాగబాబు వివరణ ఇచ్చారు. ‘అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 అన్నది నిజం. అభివృద్ధిలో నంబర్ 1 అనేది అబద్ధం’ అంటూ నాగబాబు ముగించారు. ఇంతకంటే గొప్పగా పొడుపు కథలు వేసేవారు.. నిజాయితీగా చెప్పేవారు ఎవరుంటారంటూ చంద్రబాబుకు నాగబాబు కౌంటర్ ఇచ్చారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos