ఫెడరల్ ఫ్రంట్ పై రాములమ్మ సెటైర్లు

ఫెడరల్ ఫ్రంట్ పై రాములమ్మ సెటైర్లు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ఫెడరల్ ఫ్రంట్’ పై కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి సెటైర్లు వేశారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ దేశమంతా తిరిగి, చివరకు వైసీపీ మద్దతు మాత్రమే పొందగలిగారని ఎద్దేవా చేశారు. దీని ప్రకారం చూస్తే.. టీఆర్ఎస్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్  కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమవుతుందేమోనని అన్నారు. అటువంటప్పుడు కేసీఆర్‌ కూటమిని ‘ఫెడరల్ ఫ్రంట్’ అనడం కంటే  ‘ఫెడ్ అప్ ఫ్రంట్‌’ అంటే మేలని సూచించారు. ఫ్రెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ కలిసిన మమతా బెనర్జీ, కుమారస్వామి, స్టాలిన్, అఖిలేశ్ యాదవ్ వంటి ప్రధాన నేతలు.. కోల్‌కతాలో జరిగిన మహాకూటమి సభలో పాల్గొని బీజేపీపై తమ వ్యతిరేకతను చాటారని విజయశాంతి గుర్తు చేశారు. విజయశాంతి చెప్పినది కరెక్టే…కానీ ఎన్నికలయ్యేవరకు చెప్పలేం ఎవరు ఏ కూటమిలో ఉన్నారో? ఎందుకంటే ఎన్నికలకు ముందు మారొచ్చు? లేదా ఫలితాలు వచ్చాక ప్రధాని అభ్యర్థి విషయంలో మనస్పర్థలు రావొచ్చు? ఇప్పుడే ఏది చెప్పలేం!

తాజా సమాచారం

Latest Posts

Featured Videos