ఫస్ట్ లుక్:భారతీయుడు 2

  • In Film
  • January 16, 2019
  • 801 Views
ఫస్ట్ లుక్:భారతీయుడు 2

సేనాపతి కత్తిపోటుకు రంగం సిద్ధమైంది. అవినీతిపరుల గుండెల్లో గునపం పోటు పొడవడమే లక్ష్యంగా సేనాపతి బరిలో దిగుతున్నాడు. రాజకీయ అవినీతి.. అధికారుల్లో అవినీతి.. కాంట్రాక్టుల్లో అవినీతి.. ప్రతిదీ అవినీతి కొమ్మపై నిర్మితమైన సంఘాన్ని కరెక్ట్ చేయడమే ధ్యేయంగా ఈసారి శంకర్ అస్త్రం సంధిస్తున్నాడు. ఓ రకంగా ప్రస్తుత అవినీతి సంఘంపై కసి తీర్చుకోబోతున్నాడు. అలక్ష్యం.. అభద్రత.. నిర్లక్ష్యం… పేరు ఏదైనా  సంఘంలో పేరుకుపోయిన తుప్పును వదిలించేందుకు కొత్త అస్త్రం సిద్ధం చేస్తున్నాడు. దీనికి పొలిటికల్ సబ్జెక్టును ఎంచుకుని థ్రిల్లర్ మోడ్ లో రక్తి కట్టించేందుకు శంకర్ శంకారావం పూరించాడు.

జనవరి 18 నుంచి భారతీయుడు 2 సెట్స్ పైకి వెళుతోంది. తమిళంలో ఇండియన్ 2 – హిందీలో హిందూస్తాన్ 2 పేరుతో ఈ సినిమా రిలీజ్ కానుంది. మారిన కాన్వాసులో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజ్ చేసే ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు. 2.0 వరల్డ్ వైడ్ రిలీజ్ – ఘనవిజయం నేపథ్యంలో భారతీయుడు 2 చిత్రాన్ని అత్యంత భారీతనంతో నిర్మించేందుకు లైకా సంస్థ సన్నాహాలు చేస్తోంది. దాదాపు 500కోట్ల బడ్జెట్ వెచ్చించనున్నారని తెలుస్తోంది.తాజాగా శంకర్ టీమ్ నుంచి సంక్రాంతి కానుక అందింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని లాంచ్ చేశారు. సేనాపతి లుక్ ని తాజాగా రివీల్ చేశారు. ఈ చిత్రంలో కళరియపట్టు విద్యలు – ప్రత్యేకమైన మార్షల్ ఆర్ట్స్ ను ఈ చిత్రంలో కమర్షియల్ పంథాలో ఆవిష్కరించనున్నారు. “జనవరి 18 నుంచి ఫోకస్ పెడుతున్నాం“ అంటూ ట్యాగ్ లైన్ తో పోస్టర్ ఆకట్టుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos