పూరి-రామ్.. మొదలెట్టేసారు

  • In Film
  • January 23, 2019
  • 172 Views
పూరి-రామ్.. మొదలెట్టేసారు

మొత్తానికి పూరి జగన్నాధ్ తరువాత ప్రాజెక్టు పట్టాలమీదకు వచ్చేసింది. రామ్ హీరోగా చార్మి-పూరి కలిసి నిర్మించే సినిమాను ఈరోజు స్టార్ట్ చేసారు. పూరి సినిమాల్లో కనిపించే టిపికల్ హీరో స్టయిల్ లోకి మారడానికి రామ్ కాస్త గట్టి ప్రయత్నమే చేసినట్లు కనిపిస్తోంది.అడ్డదిడంగా బటన్స్ పెట్టిన పువ్వుల చొక్కా, గళ్ల బనీను, చేతిలో రివాల్వర్ ఇవన్నీ బాగానే సెట్ అయ్యాయి. కానీ రామ్ ఫేస్ లో రఫ్ లుక్ రమ్మని పిలిచినా రాదు. అతని స్కిన్ టోన్, లుక్ వేరు. వాటిని అంత సులువుగా మార్చడం సాధ్యంకాదు.స్టిల్స్ అయితే ఇలా వున్నాయి. మరి సినిమా మేకింగ్ మొదలయ్యాక, విడియోలు చూస్తే తెలుస్తుంది ఎలా వచ్చిందో. ఇస్మార్ట్ శంకర్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో రామ్ ది ఓ డిఫరెంట్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. మణిశర్మ సంగీతం అందించే ఈ సినిమా సమ్మర్ టార్గెట్ గా తయారవుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos