పాక్‌ తో చర్చలు జరపాలి

పాక్‌ తో చర్చలు జరపాలి

న్యూఢిల్లీ: ఉగ్రవాదం నివారణకు పాక్‌తో చర్చలు జరపాలని జమ్మూ-‌కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. బుధవారం
మాధ్యమ ప్రతినిధులతో శ్రీనగర్‌లో  మాట్లాడారు. 
పఠాన్‌కోట్ దాడి, ముంబై దాడుల గురించి
సాక్షాధారాల్నిసమర్పించినా పాకిస్థాన్‌ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం నిజమేనని అంగీకరించారు. కొత్తగా ప్రధాని బాధ్యతల్ని చేపట్టిన ఇమ్రాన్‌  కొత్తగా చర్చలకు సుముఖంగా
ఉన్నందున సానుకూలంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. ఆయన అడిగినట్టుగా పుల్వామా దాడిపై తగిన ఆధారాలు పాక్‌కు ఇచ్చి, వాళ్లేంచేస్తారో చూడాలని ముఫ్తీ సలహా ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos