పశ్చిమబంగ గవర్నర్‌కు రాజ్‌నాథ్ ఫోన్

పశ్చిమబంగ గవర్నర్‌కు రాజ్‌నాథ్ ఫోన్

కోల్‌కత్తా: శారదా చిట్‌ఫండ్ కుంభకోణానికి సంబంధించిన కేసులో కోల్‌కత్తా పోలీస్ కమిషనర్‌ను ప్రశ్నించడానికి వెళ్లిన సీబీఐ అధికారులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో హైడ్రామా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సీబీఐ చర్యలను నిరసిస్తూ మమతా బెనర్జీ నిరసన దీక్ష చేపట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పశ్చిమబెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠికి ఫోన్ చేశారు. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి ఆదేశాలు పంపినట్లు రాజ్‌నాథ్‌సింగ్‌కు గవర్నర్ తెలిపారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి కేంద్ర బలగాలను పంపాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. సీబీఐ అధికారుల నివాస ప్రాంగణాలలో భద్రతా బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos