పల్లీతో పల్టీ..

  • In Crime
  • January 24, 2019
  • 748 Views

 హైదరాబాద్‌ : పల్లీలతో లక్షలస్తాయని అడ్డంగా మోసపోయిన బాధితులు రోడ్డెక్కారు. పల్లీల పేరుతో వంద కోట్ల రూపాయల వరకూ మోసం చేసిన గ్రీన్‌గోల్డ్‌ సంస్థ ఘరానా మోసం గురువారం వెలుగు చూసింది. ఈ సంస్థ ఏకంగా నాలుగు రాష్ట్రాల్లోని వారిని మోసం చేసింది. మోసపోయిన విషయం తెలుసుకొన్న బాధితులు ఉప్పల్‌లోని గ్రీన్‌గోల్డ్‌ ఆఫీసు ముందు క్యూ కట్టారు. వివరాల్లోకెళితే… నిజామాబాద్‌ జిల్లాకు చెందిన జిన్నా శ్రీకాంత్‌ అనే వ్యక్తి పల్లీ కంపెనీ అధినేతగా వ్యవహరించాడు. ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌ పక్కనే ఓ భవనాన్ని అద్దెకు తీసుకొని ఏజెంట్లను పెట్టుకున్నాడు. లక్ష రూపాయలిస్తే అంతే ఖరీదున్న యంత్రమిస్తామని, నష్టమే ఉండదని అందరినీ నమ్మించాడు. కొందరు పది లక్షలు పెట్టుబడి పెడితే, ఒకరిని చూసి మరొకరు పోటీపడి పెట్టుబడులు పెట్టారు. డబ్బు తీసుకొని యంత్రాలిచ్చిన శ్రీకాంత్‌ నెలకు రూ.20 వేలు ఇవ్వలేదు. అడిగిన వారికి అదుగో.. ఇదుగో అంటూ సమాధానం దాటేశాడు. శ్రీకాంత్‌ తీరుతో విసిగిపోయిన బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. సరూర్‌నగర్‌, ఉడా లోని బాధితులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 
శ్రీకాంత్‌తో పాటు మరో నిర్వాహకుడు భాస్కర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. కర్నాటకలోనూ వేల మంది పల్లీ బాధితులున్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos