నెహ్రూ 1954లో ‘కుంభమేళా’ స్నానం చేశారా?

నెహ్రూ 1954లో ‘కుంభమేళా’ స్నానం చేశారా?

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో అర్థ కుంభమేళా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాత్రికేయుడు, దర్శకుడు వినిదో కప్రి ఓ ఫోటో ట్వీట్ చేశారు. భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కుంభమేళాలో స్నానం చేస్తున్న దృశ్యం అంటూ ఆ ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు. అందులో నెహ్రూ జంధ్యతో కనిపించడం విశేషం. ఈనెల 17న కప్రీ చేసిన ఈ ట్వీట్‌కు 4,000కు పైగా లైక్‌లు, 1,100కు పైగా రీట్వీట్‌లు వచ్చాయి. అయితే ఆ ఫోటో నెహ్రూదే అయినా… సందర్భం మాత్రం కుంభమేళా స్నానానికి చెందినదేనా అనేది చర్చనీయాంశమైంది. కప్రి ట్వీట్‌కు గిరీష్ అనే ట్విట్టరాటీ స్పందిస్తూ…’వినోద్ కప్రీ…అబద్ధాలు ప్రచారం చేయొద్దు. నెహ్రూ తన తండ్రి చితాభస్మాన్ని అలహాబాద్‌లో నిమజ్జనం చేసినప్పటి దృశ్యమిది’ అని పేర్కొన్నారు. దీనికి కప్రి వెంటనే స్పందించారు. ‘నువ్వు అబద్ధాలు ప్రచారం చేయాలనుకుంటే చేసుకోవచ్చు. నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ 1931లో స్వర్గస్థులయ్యారు. అప్పుడు నెహ్రూ వయస్సు 42 సంవత్సరాలు. ఈ ఫోటోలో నెహ్రూ 42 ఏళ్ల వయస్సున్న వ్యక్తిలా కనిపిస్తున్నారా? ఈ ఫోటో 1952 కుంభమేళాలో తీసినదే. అప్పుడు నెహ్రూ వయస్సు 65 ఏళ్లు’ అని సమాధానమిచ్చారు. ఆసక్తికరంగా వాదోపవాదాలు అక్కడితో ఆగలేదు. భయ్యాజీ అనే మరో ట్విట్టరాటీ స్పందించారు. ‘ఈ ఫోటోను రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఫోటో మాత్రం 1954 కుంభమేళాలో తీసినది కాదు. జవహర్‌లాల్ నెహ్రూ తన తల్లి చితాభస్మాన్ని అలహాబాద్ (ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్)లో నిమజ్జనం చేనప్పటి ఫోటో అది. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ ఆనంద్ భవన్ (మ్యూజియం)లో కూడా ఈ ఫోటో ఉంది’ అని భయ్యాజీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. నిజమేమిటి?నెహ్రూ ఫోటో వెనుక నిజానిజాలు తెలుసుకునేందుకు ఓ ప్రముఖ మీడియా సంస్థ చొరవచూపి నిజానిజాలు నిర్ధారించింది. ఆ ఫోటో 1938లో నెహ్రూ ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించినప్పుడు తీసిందేనని తెల్చింది. తన తల్లి చితాభస్మం నిమజ్జనం చేసినప్పటి ఫోటో అదని, 1954 కుంభమేళా నాటిది కాదని నిర్ధారించింది. ఆధారాలేమిటి?కప్రీ ట్వీట్ చేసిన ఫోటోను గూగుల్‌‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు నిజం బయటపడింది. రెకాన్‌టాక్ డాట్‌కామ్‌లో ’15 రేర్ అండ్ ఓల్డ్ ఫోటోస్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ సేక్రిఫైజ్ అలహాబాద్ పార్ట్ 2′ అనే గ్యాలరీలో 12వ ఫోటో, కప్రీ ట్వీట్ చేసిన ఫోటోతో సరిపోయింది. ఆ ఫోటో కింద ‘నెహ్రూ తన తల్లి చితాభస్మం అలహాబాద్‌లో నిమజ్జనం చేస్తున్న దృశ్యం’ అని రాసి ఉంది. దీనికితోడు, 2014 నవంబర్ 14న ‘హోమ్‌లెస్ అలహాబాద్’ అనే మ్యాగజైన్ ప్రచురించిన ఫోటో గ్యాలరీలోనూ ఇదే ఫోటో ఉంది. ఆ ఫోటో కింద సమయం తేదీ కూడా ప్రస్తావిస్తూ క్యాప్షన్ ఉంది. 1938 జనవరి 10న అలహాబాద్‌లో నెహ్రూ తన తల్లి చితాభస్మం నిమజ్జనం చేశారని ఆ ఫోటో క్యాప్షన్‌లో ఉంది. అలాగే, ఇండియా టుడే మ్యాగజైన్ 2006, మార్చి 6న పబ్లిష్ చేసిన ‘ది నెహ్రూస్: పర్సనల్ హిస్టరీస్’ వ్యాసంలోనూ ఇదే ఫోటో ప్రచురించి ఉంది. ‘ఎండ్యూరింగ్ ట్రాజిడీ: నెహ్రూ తన తల్లి చితాభస్మం అలహాబాద్‌ జలాల్లో కలిపారు’ అని ఫోటో కింద క్యాప్షన్ ‌ఉంది.

ADVERTISEMENT

తాజా సమాచారం

Latest Posts

Featured Videos