నిర్లక్ష్యం వద్దు..

kcr fire on chandrababunaidu

గ్రామాభివృద్ధే.. రాష్ట్రాభి వృద్ధి అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌.. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులతో సమావేశమైన కేసీఆర్‌.. వారికి దిశానిర్దేశం చేశారు. గ్రామ వికాసానికి పాటుపడాలని పిలుపు ఇచ్చారు. అయితే పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ వార్నింగ్‌ ఇచ్చారు.పల్లెలు పచ్చదనంతో కలకలలాడాలని.. గ్రీన్‌ విలేజ్‌.. క్లీన్‌ విలేజ్‌లతో రాష్ట్రంలో పచ్చని వాతావరణం నెలకొనాలని సీఎం కేసీఆర్‌ పిలుపు ఇచ్చారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు, కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే రిసోర్సు పర్సన్స్ తో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. పాలనలో వారికి దిశా నిర్దేశం చేశారు.గ్రామ పంచాయతీలకు అవసరమైన నిధులు, విధులు కేటాయిస్తామని, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా పనిచేయాలని కోరారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడినా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా సర్పంచులు, గ్రామ కార్యదర్శులను సస్సెండ్ చేసే విధంగా కఠిన చట్టాన్ని రూపొందించినట్లు సీఎం హెచ్చరించారు.
గ్రామాల్లో ఆకస్మిక తనిఖీల కోసం 25 బృందాలను ఏర్పాటు చేశామన్నారు.గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని, గ్రామాలు వేదికగానే ప్రగతి ప్రణాళికలు అమలు కావాలని పిలుపు ఇచ్చారు. సర్పంచులు, వార్డు సభ్యులు అంత కలిసికట్టుగా గ్రామ ప్రజలను కలుపుకుని పల్లె వికాసానికి పాటు పడాలని పిలుపునిచ్చారు.గ్రామాల్లో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత పాటించడం, స్మశాన వాటికలు నిర్మాణంపై పంచాయతీలు ఎక్కువ దృష్టి పెట్టాలని కోరారు. గ్రామాల సర్పంచులను, గ్రామ కార్యదర్శులను ఛేంజ్ ఏజెంట్లుగా మార్చే బాధ్యతను రిసోర్సు పర్సన్లు చేపట్టాలన్నారు. గ్రామాల వికాసానికి సర్పంచులు అంకితభావంతో పనిచేయడానికి కావాల్సిన అవగాహనను, చైతన్యాన్ని కలిగించాలని కోరారు.మరోవైపు మహబూబ్‌ నగర్‌ జిల్లా మద్దూరు మండలం పెదిరిపాడు గ్రామంలో కొత్తగా ఎన్నికైన సర్పంచి బాలప్పను నేలపై కూర్చోబెట్టిన ఘటనపై సీఎం సీరియస్‌ అయ్యారు. ఇలా చేయడం దారుణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ ఎస్.కె.జోషి, ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos