నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు

  • In Money
  • February 4, 2019
  • 123 Views

ముంబయి: బడ్జెట్‌ అనంతరం స్టాక్‌ మార్కెట్లలో తొలి ట్రేడింగ్‌‌ సెషన్‌ నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం 9.33 సమయంలో సెన్సెక్స్‌ 93 పాయింట్ల నష్టంతో 36,375 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 10,865 వద్ద ట్రేడవుతోంది. తొలుత 141 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ ఆ తర్వాత కోలుకొంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ దాదాపు 35 పైసలు విలువ కోల్పోయింది. ముఖ్యంగా బడ్జెట్లో ప్రజాకర్షక పథకాలను ప్రకటించడంతో రూపాయి బలహీనపడింది. ఈ వారం కోల్‌ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్‌, ఐవోబీ, టెక్‌ మహీంద్రా, గెయిల్‌, హెచ్‌పీసీఎల్‌, ఏసీసీ, బీహెచ్‌ఈఎల్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ , ఎంఅండ్‌ఎం, డీఎల్‌ఎఫ్‌ వంటి దిగ్గజ సంస్థలు ఫలితాలను ప్రకటించనున్నాయి. కొరియా సూచీలు తప్పితే మిగిలిన ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. శుక్రవారం దాదాపు 3శాతం లాభపడ్డ చమురు ధరలు నేడు కొంచెం కుంగాయి. కానీ కొనుగోళ్లు కొనసాగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos