నవాజ్‌ షరీఫ్‌కు మెరుగైన చికిత్స, మందులు…!

నవాజ్‌ షరీఫ్‌కు మెరుగైన చికిత్స, మందులు…!

 లాహోర్‌ : పాకిస్తాన్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు గుండె సంబందిత సమస్యలతో బాధపడుతున్న కారణంగా ఆయనకు మెరుగైన మందులు, రెగ్యులర్‌ చికిత్స అవసరమౌతోందని సంబంధిత వర్గాల సమాచారం. ఏడు సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న షరీఫ్‌ మంగళవారం హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతుండగా ఆసుపత్రికి తరలించారు. అత్యంత భద్రత నడుమ పంజాబ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత డిశ్చార్జి చేయగా తిరిగి జైలుకు తరలించారు. ఆయన పరిస్థితి క్లిష్టమైనది కానప్పటికీ, గుండె సమస్యలు నివారించడానికి మెరుగైన మందులు, చికిత్స అందించాలని సీనియర్‌ వైద్యులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos