దిగ జారుడు వ్యాఖ్యలు నా చేత కాదు: పవన్‌కళ్యాణ్

దిగ జారుడు వ్యాఖ్యలు నా చేత కాదు: పవన్‌కళ్యాణ్

రాజకీయాల్లో దిగజారుడు వ్యాఖ్యలు మాట్లాడితే ప్రజల మన్నన కోల్పోతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.గతంలో జనసేనను తిట్టిన వాళ్లే నేడు పొత్తు కోపం పాకులాడుతున్నారని అన్నారు.దెందులూరు ఎమ్మెల్యేలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.తనను ఎవరెంత విమర్శించినా దిగజారుడు వ్యాఖ్యలు చేయనని జనసేన అధినే పవన్‌కళ్యాణ్ అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజల మన్నన కోల్పోతామని పేర్కొన్నారు. తాను ఇంటర్‌తో చదువు ఆపేసినా చదవడం మాత్రం ఆపలేదని, ఇప్పటికీ రోజుకు కొన్ని గంటలు చదువుతూనే ఉంటానన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలతో ప్రజలు విసిగిపోయి మార్పు కోసం ఎదురుచూస్తున్నారని, ఈ అవకాశాన్ని జనసేన అందిపుచ్చుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల కార్యకర్తలు, నాయకులతో జరిగిన సమావేశంలో పవన్ మాట్లాడారు. జనసేన ఎక్కువ సీట్లు గెలవలేదని గతంలో వ్యాఖ్యానించిన వారే నేడు పొత్తు పెట్టుకునేందుకు ఆహ్వానిస్తున్నారని, ప్రజల్లో జనసేనకు పెరుగుతున్న ఆదరణకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని పవన్ అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఎవరితోనైనా గొడవ పెట్టుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి అనుభవం ఉన్న ఉండాలన్న ఉద్దేశంతోనే 2014లో టీడీపీకి మద్దతిచ్చామని, ఇప్పుడు ఆ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని పవన్ అన్నారు. దెందులూరు ఎమ్మెల్యే వేధిస్తున్నారంటూ కొందరు దళితులు చెబుతున్నారని, అలాంటి వ్యక్తిపై ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos