ఢిల్లీలో ఉండను బాబోయ్ : సుప్రీంకోర్టు న్యాయమూర్తి

ఢిల్లీలో ఉండను బాబోయ్ : సుప్రీంకోర్టు న్యాయమూర్తి

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా దేశ రాజధాని నగరంలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాను పదవీ విరమణ చేసిన అనంతరం న్యూఢిల్లీలో నివసించబోనని చెప్పారు. అందుకు కారణాలను వివరిస్తూ ఢిల్లీలో కాలుష్యం తీవ్రంగా ఉందని, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉందని తెలిపారు. దట్టమైన పొగ మంచు, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జరిగిన కవాతు, కలుషిత గాలి వల్ల నగరంలో ప్రయాణం పీడ కలగా మారిందన్నారు. ట్రాఫిక్ వల్ల ఇద్దరు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాదాపు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. నగరంలో కాలుష్యం తీవ్రమవుతోందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ మిశ్రా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందు నేను ఢిల్లీలో నివసించాలని ఉత్సాహం చూపించేవాడినని తెలిపారు. ఇప్పుడు మాత్రం ఇక ఎంత మాత్రం ఉండకూడదనిపిస్తోందన్నారు. పదవీ విరమణ చేసిన తర్వాత ఢిల్లీలో ఉండనని చెప్పారు. ఈ నగరం ఓ గ్యాస్ ఛాంబర్‌గా మారిందని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos